అది అస్సోంలోని నాగౌవ్ జిల్లాలోని ఓ ప్రాంతం. భార్యాభర్తలకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలం వీరి జీవితం హాయిగా సాగినా భార్య ప్రవర్తన మాత్రం అందుకు భిన్నంగా ఉండేది. పెళ్లై పది సంవత్సరాలు దాటినా.. ఎదురింటి, పక్కింటి ఇలా ఎంతో మగాళ్లపై కన్నేసి చికటి సంసారానికి తెర లేపింది. అలా అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. మొత్తానికి ఇప్పటికీ 25 మంది మగాళ్లతో అఫైర్ పెట్టుకుందట. దీంతో అనేక సార్లు లేచిపొయి భర్త వద్దకు తిరుగొచ్చిన రోజులూ కూడా ఉన్నాయి.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..? అలా భార్య వేరే మగాళ్లతో వెళ్లిపోయి వచ్చిన భర్త మాత్రం భార్య నిర్ణయానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదట. అయితే ఈ నేపథ్యంలోనే మరోసారి భార్య కనిపించకుండా పోవటంతో భర్త తన పుట్టింటికి వెళ్లిందేమోనని భావించాడు. ఎంతకూ తిరిగి రాకపోవటంతో అత్తింటివాళ్లకి కబురు పంపారు. మా వద్దకు రాలేదంటూ తెలిపారు. ఇక భర్త తల్లిదండ్రులు మాత్రం విసుగు చెంది మళ్లీ ఏ మగాడితో వెళ్లిపోయిందోనని అంటున్నారు. దీంతో భర్త మాత్రం మళ్లీ తిరిగొచ్చిన కలిసి ఉండేందుకు సిద్దంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఇలాంటి భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.