వాటర్ పైప్ లైన్ ఒక్కసారిగా భయంకరమైన శబ్ధంతో పేలింది. ఈ సంఘటనలో ఓ మహిళ చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. అంతేకాదు! భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది.
ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలతో చాలా మంది మృతిచెందగా, భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా అసోంలోని గువహటిలో వాటర్ పైప్ లైన్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాటర్ పైప్ లైన్ పేలిన సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి.
ఇంకా లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. అసోం గువాహటిలోని ఖార్గులీ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అనుకోకుండా వాటర్ పైప్ లైన్ పేలింది.పైప్ లైన్ పేలడంతో నీరు భారీగా ఎగిసిపడింది. అది కూడా పెద్ద శబ్ధంతో ఈ సంఘటన జరిగింది. దీంతో స్థానికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఓ మహిళ మృతిచెందగా మరో 19 మందికి గాయాలయ్యాయి. దాదాపు 50 ఇళ్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మృతురాలిని సుమిత్రా రాభాగా గుర్తించారు. గాయాలయిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి.
స్థానికంగా 300 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ప్రవాహం ద్వారా రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తమకు జరిగిన నష్టానికి అధికారులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గువహటి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరి, భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటర్ పైప్ లైన్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.