ఈ దంపతులు ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించారు. దాని కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరికి చేతులు కాల్చుకున్నారు. చివరికి వీరికి ఓ ఐడియా తట్టడంతో ఎంతో మందిని మోసం చేశారు. ఈ దంపతులు చేసి బాగోతం ఏంటో తెలుసా?
గంగాధర్, పూర్ణచందన దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే ఈ భార్యాభర్తలు కష్టపడి కాకుండా సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలు వెతికారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేశారు. ఇక చివరికి వీరికి ఓ ఐడియా తట్టింది. తాము అనుకున్నట్లు ఎంతో మంది అమాయకులను నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. మొత్తానికి బాధితులు నష్టపోయామని తెలుసుకున్నారు. ఇక చేసేదేం ఆ దంపతులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఈ దంపతుల బాగోతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ కిలాడీ దంపతులు ఏం చేశారో తెలిస్తే నోళ్లు తెరవాల్సిందే.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం పట్టణం తెర్లాం పరిధిలోని పేరుమాళి గ్రామం. ఇక్కడే బేరి గంగాధర్, పూర్ణచందన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ దంపతులు ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టారు. కొన్నాళ్లకి వీరికి ఓ ఐడియా తట్టింది. అదే నిరుద్యోగ యువతను మోసం చేయడం. అసలు విషయం ఏంటంటే? ఈ కిలాడీ దంపతులు ఆంధ్ర యూనివర్సిటీలో కొందరికి ఉద్యోగాలు ఇప్పించినట్లుగా నకిలీ పత్రాలు, ఐడెంటీ కార్డులు తయారు చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఎంతోమంది నిరుద్యోగలకు.. ఏయూలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు.
దగ్గరి బంధువులు, దూరపు చుట్టాల్లో ఉన్న ఎంతో మంది యువతి, యువకులకు మాయమాటలు చెప్పి బాధితుల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పైగా వసూల్ చేశారు. చాలా రోజులు దాటిన డబ్బులు చెల్లించిన వారికి ఎలాంటి ఉద్యోగాలు దక్కలేదు. ఇక బాధితులు గంగాధర్, పూర్ణచందన దంపతులను ప్రశ్నించగా.. రేపు, ఎల్లుండి అంటూ కాలాన్ని వెల్లదీసి చివరికి రాజస్థాన్ వెళ్లిపోయారు. మొత్తానికి మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ దంపతులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన మోసాన్ని అంతా పోలీసుల ముందు వివరించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని రాజస్థాన్ లో ఉన్న ఈ కిలాడీ దంపతులను అరెస్ట్ చేసి తాజాగా కోర్టు ముందు హాజరుపరిచారు. ఆలస్యంగా ఈ భార్యాభర్తల బాగోతం బయటపడడంతో స్థానికులు నోళ్లు తెరిచారు. అమాయక నిరుద్యోగులను నమ్మించి రూ.2 కోట్లు నొక్కేసిన ఈ దంపతుల మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.