కట్టుకున్న భార్య అందరినీ వదిలి ఇంట్లోంచి వెళ్లిపోయింది. పెద్ద కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని దూరమైంది. ఆ తండ్రి చిన్న కూతురిపై ఆశలు పెంచుకున్నాడు. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాడు. పెద్ద చదువులు చదివించాలని అనుకున్నాడు. అయితే, పదవ తరగతి చదువుతున్న ఆ చిన్న కూతురు కూడా ప్రేమలో పడింది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి తండ్రి తల్లడిల్లిపోయాడు. ఆమెకు నచ్చజెప్పాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ, ఆమె వినలేదు. దీంతో ఆయన రాక్షసుడిలా మారాడు. కూతుర్ని కొట్టి, గొంతు నులిమి చంపాడు. తర్వాత సెల్ఫీ వీడియోలో అందుకు కారణాలు చెప్పుకొచ్చాడు.
ఈ సంఘటన వైజాగ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైజాగ్‌లోని రెల్లివీధికి చెందిన వడ్డాది వరప్రసాద్ వ్యాను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం భార్య అతడ్ని వదిలి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవటంతో ఇద్దరు కూతుళ్లతో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి పెద్ద కూతురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో ఆయన రెండో కూతురైన లిఖితా శ్రీపై ఆశలు పెట్టుకున్నాడు. ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాడు. బాగా చదివించాలని కూడా అనుకున్నాడు. కూతురికి ఆత్మ రక్షణ విద్యల్లో ఒకటైన బాక్సింగ్‌లో కూడా చేర్పించాడు.
అయితే, పదవ తరగతి చదువుతున్న లిఖితా శ్రీ కూడా ప్రేమలో పడింది. ఈ విషయం వరప్రసాద్‌కు తెలిసింది. కూతుర్ని మందలించాడు. ప్రేమ, గీమా వద్దని చెప్పాడు. అయితే, కూతురు వినలేదు. కూతురు తను చెప్పిన మాట వినకపోయే సరికి ఆయన ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అన్ని ఆశలు పెట్టుకుని పెంచుతున్న కూతురు తన మాట వినకపోవటం ఆయనకు పూర్తిగా నచ్చలేదు. పెళ్లుభికిన ఆగ్రహంతో కూతుర్ని కొట్టాడు. గొంతు నులిమి చంపాడు. అనంతరం ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తాను కూతుర్ని చంపటతానికి గల కారణాలను ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. దాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.