Bihar: నది పక్కనే ఉన్న శ్మశానం.. శ్మశానం చుట్టూ చెట్లు.. ఉన్నట్టుండి శ్మశానంలోంచి అరుపులు.. ఏడుపులు వినపడ్డం మొదలయ్యాయి. శ్మశానానికి దగ్గరలో కట్టెలు కొట్టుకుంటున్న కొందరు మహిళలు ఆ అరుపులు విన్నారు. శ్మశానంలోంచి అలా అరుపులు, ఏడుపులు వినపడ్డంతో దెయ్యం అనుకున్నారు వారంతా. కొద్దిసేపటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. ధైర్యం చేసి శ్మశానంలోకి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు.
కానీ, ఓ చోట మట్టి తవ్వినట్లు గుర్తులు కనిపించాయి. దీంతో ఎవరో ఓ మనిషిని సజీవంగా పాతిపెట్టారని గ్రామస్తులు భావించారు. వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్వారు. మట్టి లోపల ఓ మూడేళ్ల బాలిక కనిపించింది. ఆ బాలిక నోట్లో మట్టితో ఉంది. పాప నోట్లోని మట్టి తొలగించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు.
బాలికను విచారించగా.. బాలిక మాట్లాడుతూ.. ‘నా పేరు లాలి. మా అమ్మ నాన్నల పేర్లు రాజు శర్మ, రేఖ శర్మ. మా అమ్మ, నాన్నమ్మ నన్ను శ్మశానం దగ్గరకు తీసుకువచ్చారు. నేను ఏడుస్తున్నా.. అప్పుడు వాళ్లు నా నోట్లో మట్టి కుక్కారు. మట్టి లోపల పాతిపెట్టారు’’ అని చెప్పుకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రుల్ని, గ్రామాన్ని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kurnool: ప్రియురాలు లేని లోకంలో ఉండలేనంటూ.. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య!