ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న యువతిని అడ్డగించాడో యువకుడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఏదో చేయబోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఆడది రోడ్డుపై కనిపిస్తే చాలు.. ప్రేమ పేరుతో టార్చర్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఒప్పుకుంటే సరే.. లేదంటే హత్యలు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న దారుణాలు కూడా ఇవే. అయితే, ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదు. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ యువకుడు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ పరిధిలోని ఆర్య సమాజ్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉండే ఓ యువతి ఇటీవల ఇరుకు రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమె వెనకాలే వచ్చాడో యువకుడు. ఆమెను దగ్గరికి లాక్కుని ఏదేదో చేయబోయాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి ఎన్నో ప్రయత్నాలు చేసి ముందుకు సాగింది. అయినా వదలని ఆ ఆకతాయి.. ఆ అమ్మాయి వెంటే వెళ్తూ మరో చోట అడ్డగించాడు. ఆమెను దగ్గరకి లాక్కుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వీడియోలు తీశారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చివరికి పోలీసుల వరకు వెళ్లినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై స్పందించిన అధికారులు ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#मुज़फ़्फरनगर: सुनसान गली में अकेली लडक़ी से बदतमीजी, जबरदस्ती बाइक पर बैठाने की कोशिश, विरोध पर युवती के साथ मारपीट, मुंह पकड़कर भींचा, बैग भी पकड़कर खींचा, युवती के साथ जोर-जबरदस्ती का वीडियो हुआ वायरल, जानसठ के आर्य समाज मंदिर के पास का बताया जा रहा है वीडियो। #muzaffarnagar… pic.twitter.com/GEOr8xhSel
— Samachar Today (@samachartodaytv) June 23, 2023