కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కోరిక తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరు వావివరసలు కూడా చూడటంలేదు. వారు అనుకున్నది సాధించేందుకు దిగజారుడు పనులు చేస్తున్నారు. అలాంటి ఓ యువకుడు పక్కింటి యువతిపై కన్నేశాడు. అన్నా అని పిలుస్తున్నా కూడా అతను మాత్రం వక్రబుద్ధితోనే చూశాడు. చెల్లి అంటూనే చనువు పెంచుకున్నాడు. ఆ చనువుతోనే రోజూ ఇంటికి వెళ్తుండేవాడు. అలా ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మొదటిసారి ఊరుకుందని.. రెండోసారి కూడా అదే పనికి తెగబడ్డాడు. ఈసారి మాత్రం ఆమె తల్లిదండ్రులకు చెప్పేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ ధోలాపూర్ కు చెందిన ఘనశ్యామ్ చాహర్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పక్కన ఇంట్లో ఉండే యువతి చాహర్ తో కాస్త చనువుగా ఉంటుంది. అన్నా అని పిలిస్తూ తరచూ మాట్లాడుతూ ఉంటుంది. అతడిని తన సొంత అన్నలా భావిచేది. కానీ, అతని మనసులో మాత్రం ఇంకో ఉద్దేశం ఉంది. ఆమెను ఎప్పుడూ సోదరిలా చూడలేదు. అవకాశం కోసం మాత్రమే ఎదురు చూశాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని కాపు కాశాడు. ఓ రోజు ఆ అవకాశం రానే వచ్చింది.
యువతి ఒక్కతో ఇంట్లో ఉంది. ఆ విషయం తెలుసుకున్న యువకుడు తన కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. ఎప్పటిలాగానే ఇంట్లోకి మామూలుగా వెళ్లాడు. మాటామాటా కలిపి ఎవరూ రారని నిర్ణయించుకున్నాక పాడు పని చేశాడు. ఆమెను అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికి చెప్పుకోవాలో? ఎలా చెప్పాలో? అర్థంకాక యువతి మౌనంగా ఉండిపోయింది. అదే అవకాశంగా తీసుకున్నాడు. మొదటిసారి చేసిన పనిని ఆమె బయట పెట్టకపోవడంతో.. అదే అదునుగా ఫిబ్రవరి 18న మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: ఇంట్లో పని చేసే డ్రైవర్ తో ప్రేమ! చివరికి ట్విస్ట్ ఊహించలేరు!
ఈసారి ఆ యువతి మౌనంగా ఉండలేదు. ఇలాగే ఊరుకుంటే తన జీవితం నాశనం చేస్తాడని భావించింది. ధైర్యం చేసి ఆ యువకుడు చేసిన పాడు పని గురించి తన తల్లిదండ్రులకు చెప్పుకొంది. తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. అన్నా అని పిలిచే యువతిపై అలాంటి ఉద్దేశం పెంచుకున్నాడా అని షాకయ్యారు. వెంటనే యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. చాహర్ పై ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాహర్ ను అరెస్టు చేసేందుకు వస్తున్నారని తెలుసుకున్న యువకుడు పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.