తన కుటుంబ పరిస్థితిలను అర్థం చేసుకుని, చదువులో రాణిస్తేనే జీవితం బాగుంటుదని భావించిన ఓ విద్యార్థికి దానికి అనుగుణంగా శ్రమించి పదవ తరగతిలో 10/10 పాయిట్లు సాధించింది. అంతే కాక ఆమె శ్రమకు ఫలితంగా నూజివీడ ట్రిపుల్ ఐటీ లో సీటు దక్కింది. ఈ గురువారం నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో చేరాల్సి ఉంది. ఇంతలో ఏ జరిగిందో ఏమో తెలీదు ఆ చదువుల తల్లి అనుమానస్పంద స్థితిలో మృతిచెందింది. పాప మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా కన్నతల్లి మరికొందరితో కలిసి కాల్చేయడం అందరికి ఆశ్చర్యమయింది.ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…ప్రకాశం జిల్లా లింగసముద్రం చెందిన మాధవి తిమ్మారెడ్డిపాలెంలోఎఎన్ ఎం గా పనిచేస్తుంది. కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తుంది. భర్త చీరాలలోని ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. మాధవి తన కుమార్తె ప్రశాంతి(16)తో కలిసి లింగసముద్రంలో ఉంటుంది. అయితే ప్రశాంతి సోమవారం రాత్రి అనుమానస్పంద స్థితిలో మృతి చెందింది. ప్రశాంతి మృతదేహాన్ని మాధవి ఒక రోజుపాటు ఇంట్లోనే ఉంచింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా ఊరికి సమీపంలో ఉన్న అటవి ప్రాంతంలనికి తన ఇంటి కింద పోర్షన్ లో ఉంటున్న వ్యక్తి సహాయంతో తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టింది. పూర్తిగా కాలకపోవటంతో మట్టి,బండరాళ్లలో మృతదేహాన్ని పూడ్చింది.
మాధవి కొన్నళ్ల నుంచి జంగంరెడ్డి పాలెంకు చెందిన ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. మాధవి ఉంటున్న కింది పోర్షన్ లోనే అతను కూడా ఉంటున్నాడు. వీరి మధ్య ఉన్న సంబంధానికి ప్రశాంతి అడ్డుగా మారిందని అనుకుని వీళ్లే కడతేర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మాధవి, అటు ఆ యువకుడు పోలీసులకు, గ్రామస్థులకు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. “పాపకు గుండెపోటు వచ్చి చనిపోయిందని ఒకసారి, మెట్ల పై నుంచి జారిపడి తలకు దెబ్బతగలడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే మార్గం మధ్యలో మరణించింది” అని మాధవి పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఒక వేళ పాపకు నిజంగానే మెట్ల పై నుంచి పడి మరణిస్తే గుట్టుచప్పుడు కాకుండా కాల్చే ప్రయత్నం ఎందుకు చేసిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు పాప మరణిస్తే కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా అంటూ మరికొందరు సందేహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న లింగసముద్రం ఎస్సై ఈ సంఘటన పై మాధవిని విచారణ చేస్తున్నారు.