బెంగుళూరు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ తల్లితో పాటు ఇద్దరు కవలలు లారీ చక్రాల కింద నలిగి ముక్కలుగా మారి మరణించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఇక విషయం ఏంటంటే..? హసన్ పట్టణంలో శివానంద్, జ్యోతి ఇద్దరు భార్యాభర్తలు. అయితే ఇటీవల గత ఆదివారం రోజు ప్రయాణం ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అలా బైక్ పై హసన్ పట్టణ శివారులోని భార్యాభర్తలతో పాటు కవలల వెళ్తున్న క్రమంలో వెనక నుంచి లారీ వీరి బైక్ ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కవలలు లారీ చక్రాల కింద నలిగి దాదాపు రెండు కిలో మీటర్ల మేర వెళ్లి ముక్కలుగా మారారు. దీంతో ఇద్దరు కవలలు అక్కడికక్కడే మరణించగా, తల్లి జ్యోతి ఆస్పత్రిలో చికత్స పొందుతు తాజాగా మరణించింది. ఇక భర్త శివానంద్ కూడా తీవ్ర గాయలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ప్రమాదానికి అసలు కారణం లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమేనని స్థానికులు వాపోతున్నారు. ఓ లారీ నిర్లక్ష్యానికి తల్లి, ఇద్దరు పిల్లలతో పాటు ఓ నిండు కుటుంబ ఛిద్రమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.