నవమాసాలు మోసిన తల్లే.. ఆ కూతుర్ని కడతేర్చింది. గోరుముద్దులు తినిపించిన ఆ చేత్తేనో ఘోరంగా హత్య చేసింది. ఎదిగొచ్చిన కుమార్తెను ఏదొక అయ్య చేతిలో పెట్టాల్సింది పోయి అన్యాయంగా ఉసురు తీసింది. తల్లి తప్పుడు దారిలో పోతోందని హెచ్చరించిన పాపానికి కడుపున పుట్టిన కూతుర్నే కడ తేర్చింది. ఆమె అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఓ రోజు ప్రియుడి ఒడిలో ఓలలాడుతూ అమ్మాయి కంట పడింది. అంతే ఇంక ఆమె ఉంటే వారి సంబంధం కొనసాగదని భావించి ప్రియుడితో కలిసి ఈ పని చేసింది.
వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాళెంలో వెంకటయ్య- రమణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి వెంకట సుజాత(17) కుమార్తె ఉంది. వెంకటయ్య మద్యానికి బానిస అయ్యి.. ఇంట్లో ఏ విషయాలను పట్టించుకోవడం మానేశాడు. ఇంట్లో పెత్తనం అంతా రమణమ్మ చేతికి వచ్చేసింది. ఆమె సమీప బంధువు శీనయ్యతో పరిచయం పెంచుకుంది. వారి పరిచయం కాస్తా కామకోరికలు తీర్చుకునే దాకా వెళ్లింది. తరచూ వారు వారి అవసరాలు తీర్చుకునేందుకు కలుస్తుండేవారు. వెంకటయ్య మద్యం మత్తులో ఎక్కువగా ఉండేవాడు.
రమణమ్మకు ఎదురు చెప్పే వాళ్లు లేరు. వారి అక్రమ సంబంధాన్ని ఇంటి దాకా తీసుకొచ్చింది. అక్కడా ఇక్కడా కాకుండా పడక గదికే మకాం మార్చారు. రమణమ్మ- శీనయ్య సంగతి హద్దులు దాటిపోయింది. ఎవరన్నా చూస్తారనే భయం కూడా పోయింది. అలా ఓ రోజు ఇంట్లో ఇద్దరూ పడక గదిలో ఉండగా వెంకట సుజాత కంట పడ్డారు. ఇందేం పోయేకాలం అంటూ తల్లిపై కోపడింది. తండ్రికి చెప్పినా ఉపయోగం లేదని తెలుసు. బంధువులకు చెప్తాననడంతో భయపడి శీనయ్యకు దూరంగా ఉండటం మొదలు పెట్టింది. కానీ, ప్రియుడికి దూరంగా ఉండటం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఎంత కష్టం అంటే ప్రియుడి కోసం, అతనితో సుఖం కోసం కన్న కూతుర్నే కడతేర్చేంతగా అనమాట. తన సుఖం కోసం వెంకట సుజాతను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఓ రోజు వెంకట సుజాత నిద్రపోతున్న సమయంలో శీనయ్యకు విషయం చెప్పింది. అతను కొండయ్య అనే మరో వ్యక్తిని తీసుకుని ఇంటికి వచ్చాడు. అలా నిద్రపోతున్న సుజాత మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని దగ్గర్లోని బావిలో పడేశారు. ఆ తర్వాత తన కుమార్తె ఇంట్లోంచి వెళ్లి పోయిందని పొరుగువారిని నమ్మించింది. తన మానసికస్థితి సరిగ్గా లేదని అందరినీ నమ్మించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత రెండ్రోజులకు సుజాత మృతదేహం బావిలో కనిపించింది. పోస్టుమార్టం రిపోర్టులో అది హత్య అని తేలింది. తల్లిని గట్టిగా విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. తన సంబంధానికి అడ్డుగా ఉందనే కుమార్తెను కడతేర్చినట్లు రమణమ్మ అంగీకరించింది. కట్టుకున్న భర్త కన్నా, కడుపున పుట్టిన కుమార్తె కన్నా కూడా ఆమెకు ప్రియుడే ఎక్కువయ్యాడు. ప్రియుడి పక్కలో దొరికే తుచ్యమైన సుఖమే ఎక్కువైంది. అందుకు అంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ మహిళకు ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.