విధి ఆడే వింత నాటకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంతా బాగుందనుకునే సమయంలో అనుకోని ఘటనలు.. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతాయి. అచ్చం అలానే ఎన్నో కలలు కన్న ఓ వైద్య విద్యార్థి.. అనుకోకుండా జరిగిన ఓ ఘటనలో మృతి చెందాడు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా ప్రజలకు సేవలు అందించాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విజయవాడకు చెందిన రుషికేశ్ జశ్వంత్ మిమ్స్ కాలేజి లో నాలుగో ఏడాది ఎంబీబీఎస్ చదువుతున్నాడు. విజయనగరంలోని వేణుగోపాలపురంలో ఉండే రుషికేశ్ ఆగస్టు 9న అయ్యప్పనగర్ వెళ్లి స్నేహితుడు రాముతో కలిసి క్రికెట్ ఆడాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో తిరిగి స్నేహితులతో కలసి బైక్‌పై వేణుగోపాలపురం బయలుదేరారు. వీరి బైకు ఊటగెడ్డ సమీపంలో రాగానే ఎదురుగా వస్తున్న పందిని తప్పించబోయి అదుపు తప్పి పక్కనే ఉన్న సిమెంటు స్తంభాలను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న జశ్వంత్‌కు, వెనుక కూర్చున్న రాముకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి అంబులెన్స్‌లో మిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే జశ్వంత్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరికొన్ని రోజులు చదువు పూర్తి చేసి… వైద్యుడికి సేవలు అందించాల్సిన తమ కుమారుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.