వాళ్లిద్దరూ ఇష్టపడ్డి..ప్రేమించుకున్నారు. ఆ సమయంలో ఎన్నో అడ్డుకులను ఎదుర్కొని.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారి అన్యోన్యతను చూసి.. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందూరు. హాయిగా సాగుతున్న వారి సంసారంలో భర్తకు ఉన్న మద్యం అలవాటు చిచ్చు పెట్టింది. నిత్యం తాగొచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. రోజు రోజూకు ఈ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. దీంతో సహనం కోల్పోయిన ఆ భార్య.. మొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి హతమార్చింది. ప్రకాశం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గాజులపాలెంకు చెందిన క్రిష్టిపాటి కృష్ణారెడ్డి(31), సంతనూతలపాడుకు చెందిన రుక్మిణి.. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు జన్మించాడు. ఇప్పుడు ఆ బాబుకు ఐదేళ్లు. ప్రసుత్తం ఈ దంపతులు సంతనూతలపాడులో నివాసం ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన కృష్ణా రెడ్డి కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అయిన భర్తను మార్చుకోవచ్చులే అని..వేధింపులు భరిస్తూ వచ్చింది.
ఈక్రమంలో మూడు రోజులుగా శారీరకంగానూ హింసిస్తుండంతో గొడవలు పెరిగాయి. సోమవారం కూడా మద్యం తాగి వచ్చి భార్యతో కృష్టా రెడ్డి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో శారీరక, మానసిక వేధింపు తట్టుకోలేక ఆమె.. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇంటి తలుపు గడియపెట్టి బయటకు వచ్చేసింది. దీంతో శరీరం పూర్తిగా కాలిపోయి కృష్ణా రెడ్డి చనిపోయాడు. ఈ ఘటనపై మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. రుక్మిణిని అదుపులోకి తీసుకున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.