ప్రపంచం ఓ వైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే మరోపక్క నేరాలు, ఘోరాలు చడి చప్పుడు కాకుండా పుట్టుకొస్తున్నాయి. మహిళలపై దాడులు, చిన్నారులపై అత్యాచారాలు. ఇవే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న అకృత్యాలు. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం.
ఇదే గ్రామంలో నివాసముంటున్న ఓ భార్య భర్తలకు గతంలో వివాహం జరిగింది. వీరికి ఓ ఐదేళ్ల కూతురు కూడా ఉంది. అడి పాడే వయసు, అమ్మా నాన్న తప్పా మరే ప్రపంచం తెలియని పసి బాల్యం ఆ పాపది. అయితే భర్త మాత్రం మద్యానికి బానిసై చూడకూడని వీడియోలు చూస్తూ వాటినే అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నరరూప రాక్షసుడికి మదిలో దారుణమైన ఆలోచన పుట్టుకొచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై కోరికలు పెంచుకున్నాడు. అభం శుభం తెలియని ఆ ఐదేళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు.
ప్రతి రోజు నాన్న వద్ద పడుకొను అని కూతురు ఎంత ఏడ్చిన తల్లి పసిగట్ట లేక పోయింది. దీంతో మాటు వేసిన తండ్రి కూతురిపై అత్యాచారం చేశాడు. దీంతో గమనించిన తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.