కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు కెంగేరి వద్ద గత ఆగస్ట్ లో రైలు కింద పడి యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల ఈ యువ వైద్యుడి ఆత్మహత్య కేసులో హనీట్రాప్ కుట్ర బయటపడింది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్య నిందితుండిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సార్థిక్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఒక రోజు కొత్త నెంబర్ నుంచి ఓ యువతి వాట్సప్ మెసేజ్ చేసింది. ఈ క్రమంలో యువ వైద్యుడితో ఆ యువతి వాట్సప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఒకరోజు వీడియో కాల్ చేసిన యువతి నగ్నంగా కనిపించింది. ఆ యువకుడిని కూడా అలా చేయాలని ప్రేరేపించింది. అతను కూడా అలానే చేశాడు. ఈ క్రమంలో ఆ కాల్స్ ను రికార్డు చేసిన యువతి, ఆ యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. అతడి నుంచి రూ.67 వేల వరకూ వసూలు చేసింది.
అంతటితో ఆగకా మరింత డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఇంటర్నెట్ కి, తన స్నేహితులకు వీటిని పంపిస్తానని ఆ యువతి బెదిరించింది. దీంతో దిక్కుతోచక భయంతో ఆ యువ వైద్యుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో చిన్న పొరపాటు చేసినా జీవితమే నాశనం అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.