ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. చదువుకునే వయసులోనే పిల్లలు నచ్చిన వాడితో ప్రేమలో పడిపోతున్నారు. కొన్నేళ్ల పాటు వాడితో సినిమాలు, షికారులు అంటూ తిరిగి చివరికి వాడినే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా సరే.. వారిని ఎదురించి మరీ వివాహం చేసుకుంటున్నారు. ఇక కాదు, కూడదని తల్లిదండ్రులు ఎదురొస్తే వారిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ టీనేజ్ కూతురు తన ప్రియుడి కోసం ఏకంగా కన్న తల్లిని కత్తితో పొడిచి చంపింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అది మహారాష్ట్ర థానే పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ టీనేజ్ కూతురు కూడా ఉంది. అయితే ఈ బాలిక తల్లిదండ్రులు చదువుకోమని పంపింతే.. స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇక టైమ్ దొరికితే చాలు.. ఆ బాలిక ప్రియుడితో కలిసి ఎంచక్క సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగింది. కొంత కాలం తర్వాత అసలు విషయం ఆ బాలిక తల్లికి తెలిసింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లి కూతురుని గట్టిగా మందలించింది. ఇక నుంచి అతడిని కలిసినా, మాట్లాడినా చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ప్రియుడితో ఉండేందుకు నా తల్లి అడ్డుగా ఉందని భావించి ఆ బాలిక తల్లినే చంపాలనుకుంది. అయితే ఆ బాలిక ఇదే విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది.
ఇక ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పథకం ప్రకారమే ఆ బాలిక ప్రియుడితో చేతులు కలిపి ఇటీవల తన తల్లిని కత్తితో దారుణంగా పొడిచి చంపింది. అనంతరం ఇద్దరూ ఎవరికీ కనించకుండా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. లవర్ కోసం కనిపెంచిన తల్లిని కత్తితో పొడిచి చంపిన టీనేజ్ కూతురు తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.