భార్యాభర్తల కాపురం సాఫీగా సాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకంతో పాటు అర్థం చేసుకునే మనస్థత్వం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇద్దరి దాంపత్య జీవితం మూడు కాలాల పాటు పచ్చగా వెలుగుతుంది. అలా ఇద్దరిలో ఒకరు అర్థం చేసు కోలేకపోయినా వారి సంసారం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. అచ్చం ఇలాగే ఓ భర్త చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటోంది.
ఇది కూడా చదవండి: తమ్ముడి కూతురుని తల్లిని చేసిన దుర్మార్గుడు!
అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది రాజస్తాన్ లోని చురు జిల్లా సదర్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తికి గతేడాది ఫిబ్రవరిలో మహిళతో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి కొన్ని రోజులు మాత్రమే వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే రోజులు మారుతున్న కొద్ది భర్త తాగుడుకు బానిసై అప్పులు విపరీతంగా చేశాడు. దీంతో అప్పటి నుంచి భార్యను వరకట్న వేధింపులు గురి చేశాడు.
కాగా అప్పలు ఇచ్చిన రుణదాతలు ఇంటికి రావడంతో భర్తకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి భార్యను వారితో పడుకోవాలంటూ బలవంతం చేశాడు. దీంతో తట్టుకోలేక పోయిన భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.