ఆమెకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. అయినా భర్త చాలదన్నట్లుగా వరుసకు మరిదితో తెర వెనుక ప్రేమాయణాన్ని నడిపించింది. ఇక ప్రియుడితో గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని భార్య భర్త హత్యకు ప్లాన్ గీసింది. ఆమె ప్రయత్నం విఫలమవ్వడంతో చివరికి ఈ కిలాడీ చేతులు కాల్చుకుని జైలులో ఊచలు లెక్కబెడుతోంది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు పెళ్లైన మహిళలు తాళికట్టిన భర్తను వదిలేసి పరాయి మగాడితో పడక సుఖానికి అలవాటుపడుతున్నారు. భర్త కళ్లు గప్పి ఎంచక్కా ప్రియుడితో సరసాలకు కాలుదువ్వి రొమాన్స్ లో ఆరితేరుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ ఇల్లాలు.. కట్టుకున్న మొగుడిని కాదని మరిదిపై మోజు పడింది. అలా చాలా కాలం పాటు మరిదితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. కానీ, ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని ప్రాణాలతో లేకుండా చేయాలనుకుంది. ఇందుకోసం ఓ ప్లాన్ గీసి చివరికి అడ్డంగా దొరికిపోయింది. తాజాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం పరిధిలోని ఇంద్రనగర్ గ్రామం. ఇక్కడే ఉన్న భరత్ నగర్ కాలనీలో చిట్యాల బాలకృష్ణ-శైలజ (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ, రాను రాను శైలజ వరుసకు మరిది అయిన శ్రీకాంత్ అనే యువకుడిపై మనసుపడింది. దీంతో వదిన, మరిది ఇంకాస్త దగ్గరై చివరికి వివాహేతర సంబంధాన్ని బలపరుచుకున్నారు. అలా శైలజ చాలా కాలం పాటు భర్త కళ్లు గప్పి ప్రియుడు శ్రీకాంత్ తో చీకటి కాపురానికి తెర లేపింది.
ఇక కొన్నాళ్ల తర్వాత భార్య రంకుపురాణం భర్త బాలకృష్ణ చెవిన పడింది. దీంతో అతడు కోపంతో ఊగిపోయి భార్య శైలజకు, శ్రీకాంత్ కు వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి వదినామరిదిల సరసాలకు అడ్డకట్టు వేసినట్టు అయింది. ఇక ఎలాగైన శైలజ ప్రియుడికి దగ్గరవ్వాలని అనుకుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి మొగుడిని చంపాలనే ప్లాన్ గీసింది. ఇదే విషయాన్ని ప్రియుడు శ్రీకాంత్ కు వివరించింది. ప్రియురాలి నిర్ణయాన్ని కాదనని మరిది శ్రీకాంత్.. చంకలు గుద్దుకుని సరేనన్నాడు. బాలకృష్ణ హత్యలో భాగంగానే ఇద్దరూ అతడిని కరెంట్ షాక్ తో చంపాలని అనుకున్నారు. దీని కోసం బాలకృష్ణ రోజూ పొలానికి వెళ్లే దారిలో కనిపించకుండా వైర్లను ఏర్పాటు చేశారు.
ఇటీవల బాలకృష్ణ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడికి కాస్త అనుమానం వచ్చి అడుగులు వెనక్కి వేసి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వదిన, మరిదిల ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఇద్దరూ ఇటీవల ఎవరికీ కనిపించకుండా పారిపోయారు. దీంతో అనుమానం వచ్చిన భర్త బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులు అయిన శ్రీకాంత్, శైలజను అరెస్ట్ చేశారు. ఇక విచారణలో అసలు నిజాలు బయటపడడంతో నిందితులను జైలుకు తరలించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మరిదిపై మోజుతో భర్తను చంపాలని చూసి చివరికి చేతులు కాల్చుకున్న ఈ కిలాడీ లేడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.