Crime News: ఓ యువతి విషయంలో స్నేహితురాలే శత్రువుగా తయారైంది. తన ప్రతిపాదనను ఒప్పుకోలేదని యువతిపై దారుణానికి ఒడిగట్టింది. తండ్రితో కలిసి యువతిని కిడ్నాప్ చేసి క్రూరంగా ప్రవర్తించింది. ఈ సంఘటన పాకిస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాకిస్తాన్, ఫైసలాబాద్‌కు చెందిన కథిజా మహ్మద్ డాక్టర్ చదువుతోంది. షేక్ ధనిష్ అనే యువతి కూడా అదే కాలేజీలో డాక్టర్ చదువుతోంది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ఎక్కువకాలం నిలవలేదు. షేక్ ధనిష్‌కు ఓ పాడు బుద్ధి పుట్టింది. కొద్దిరోజుల క్రితం ఓ పనికమాలిన ప్రపోజల్‌ను కథిజా ముందు పెట్టింది.
తన తండ్రిని పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే, ఇందుకు కథిజా ఒప్పుకోలేదు. దీంతో షేక్ ధనిష్ ఈగో హర్ట్ అయింది. ఎలాగైనా కథిజాపై పగ తీర్చుకోవాలనుకుంది. తాజాగా, కథిజా ఇంట్లోకి తన తండ్రితో పాటు మరికొంతమందితో ప్రవేశించింది. అక్కడినుంచి ఆమెను కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత వారంతా ఆమెపై దారుణాతి దారుణానికి పాల్పడ్డారు. తనపై జరిగిన దాడి గురించి కథిజ మాట్లాడుతూ.. ‘‘ వాళ్లు నన్ను బాగా కొట్టారు. నా జుట్టును కత్తిరించారు. నా కనుబొమ్మలు తొలిగించారు. బలవంతంగా బూట్లను నాకించారు’’ అని తెలిపింది. దాడి తర్వాత వాళ్లు కథిజాను వదిలేశారు.
ఇంటికి చేరుకున్న కథిజా పోలీసులను ఆశ్రయించింది. స్నేహితురాలు, ఆమె తండ్రి ఇతర నిందితులపై పోలీసుకు ఫిర్యాదు చేసింది. నిందితులు కిడ్నాప్ సందర్బంగా తన ఇంట్లో దోపిడికి పాల్పడ్డారని పేర్కొంది. వాళ్లు ఐదు లక్షల నగదు, 4లక్షల రూపాయలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులకోసం అన్వేషణ ప్రారంభించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
فیصل آباد پولیس نے خاتون پر تشدد اور تذلیل کرنے والے چھ ملزمان سمیت اس خاتون ملزمہ کو کل ہی گرفتار کر لیا تھا۔ سی پی او فیصل آباد نے اس کیس کی تفتیش کے لیے خصوصی ٹیم تعینات کی ہے۔ اس افسوسناک واقعہ میں ملوث ملزمان کو کڑی سزا دلوائی جائیگی. @fsdpolice https://t.co/U6pW3e1Z7v pic.twitter.com/cHNVxGpP48
— Punjab Police Official (@OfficialDPRPP) August 17, 2022
ఇవి కూడా చదవండి : భర్త కొత్తచీర కొనివ్వలేదని ఊరేసుకున్న భార్య!