ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న కారణాలకే తీవ్ర మనస్థాపానికి లోనవుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, భర్త సినిమాకు తీసుకెళ్లాలేదని.., ఇలా కారణాలు వేరైన చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరిగా ఇలాగే అలిగిన ఓ భార్య పెళ్లి రోజు భర్త కొత్త చీర కొనివ్వలేని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసుల కథనం మేరకు.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన శ్రీనివాసరావుకి శంకవరం మండలం నెల్లలిపూడికి చెందిన పద్మినితో 2017 వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. గ్రామంలోని మహిళలు ఈర్ష్య పడేలా, వేలెత్తి చూపుకుండా బతుకుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 11న ఈ భార్యాభర్తల పెళ్లి రోజు. దీంతో భార్య భర్తను కొత్తచీర కొనివ్వాలని కోరింది. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో చీర కొనలేనని చెప్పాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ కూడా జరిగింది. కొత్తచీర కొనివ్వలేనని భర్త తెగేసి చెప్పడంతో భార్య తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఏం చేయాలో తెలియక భర్తలేని సమయంలో చున్నీతో ఉరేసుకుని పద్మిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పద్మిని రూమ్ నుంచి ఒక్కసారిగా అరుపులు వేయడంతో స్థానికులు గమనించి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్న ఆమెను కిందకు దింపారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మిని తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొత్తచీర కొనివ్వలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: గ్రామంలో అలజడి.. ఒకేసారి ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య!