దేశంలో విపరీతంగా పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తమ కూతురు కులం తక్కువ వాడిని ప్రేమించిందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి పరువు హత్యలు గతంలో చాలానే జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే తాజాగా మరో పరువు హత్య చోటు చేసుకుంది. సోదరి నచ్చని వృత్తిని ఎంచుకుందని అన్న తుపాకితో కాల్చాడు. తాజాగా జరిగిన ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలంగా మారింది.
ఇది కూడా చదవండి: Maharashtra: పోలీసులకు చుక్కలు చూపించిన యువకుడు.. పట్టుకోబోయిన పోలీసులను కొరికి!
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని ప్రావిన్స్ లో 21 ఏళ్ల యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే ఈ యువతికి డ్యాన్స్, మోడలింగ్ అంటే ఇష్టం కావడంతో అదే వృత్తిని ఎంచుకుంది. యువతి తల్లిదండ్రులు మాత్రం మన కుటుంబానికి విరుద్దమైన వృత్తిని ఎంచుకున్నావని పరువు పోతుందని ఒత్తిడి చేస్తూ వద్దంటూ అనేక సార్లు నచ్చజెప్పారు. కానీ ఆ యువతికి డ్యాన్స్ అంటే ఇష్టం కావడంతో తల్లిదండ్రుల మాట అస్సలు లెక్కచేయలేదు.
ఇక ఇటీవల తన సోదరికి ఆ వృత్తి నుంచి రావాలంటూ అన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆ యువతి వెనక్కి తగ్గలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన సోదరుడు సోదరిని తుపాకితో కాల్చి హత్య చేశాడు. ఈ దాడిలో సోదరి రక్తపు మడుగులో పడ ప్రాణాలు విడిచింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.