మోసపోయే వాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసే వాళ్లు ఉంటారు. నేటి కాలంలో సమాజంలో చైన్ మార్కెటింగ్, వర్క్ ఫ్రం హోం పేరిట జరిగే మోసాలు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో కేటుగాళ్లు.. సెలబ్రిటీల ఫొటోలు వాడుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
యూట్యూబర్ హర్ష సాయి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం యూట్యబ్‌ను అందరు తమ స్వలాభం కోసం.. డబ్బులు సంపాదించుకోవడం కోసం వినియోగించుకుంటుంటే.. హర్ష సాయి మాత్రం అందుకు భిన్నంగా.. తన సంపాదనను పేదవారికి ఖర్చు చేస్తాడు. ఎందరో పేదవాళ్ల కలలు తీర్చాడు హర్షసాయి. కొన్నాళ్ల క్రితం ఓ బార్బర్ షాప్ అతడికి ఇల్లు, షాప్ నిర్మించి ఇవ్వగా.. తాజాగా ఓ పేదవాడిని లక్షాధికారిని చేశాడు. హర్ష సాయి చేసే పనులకు నెటిజనులు ఆశ్చర్యపోతుంటారు. యూట్యూబర్లందరూ సంపాదన కోసం వీడియోలు చేస్తూంటే.. హర్షసాయి మాత్రం వేరే వాళ్లకు సాయం చేసి.. దానిలో తన సంతోషం వెతుక్కుంటాడు. ఇక యూట్యూబ్‌లో హర్ష సాయికున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సెలబ్రిటీలకు ధీటుగా అభిమానులను సంపాదించుకున్నాడు హర్ష సాయి.
అయితే హర్ష సాయికున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని.. సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. చైన్ మార్కెటింగ్, పార్ట్ టైమ వర్క్, ఇంటి దగ్గర నుంచి పని, కాపీ, పేస్ట్ వర్క్, రైటింగ్ వర్క్ జాబ్స్ ఉన్నాయి అని చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మరీ ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగ యువత, పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని.. వారికి ఆశలు కల్పించి.. అందిన కాడికి దోచుకుని పత్తా లేకుండా పోతున్నారు మోసగాళ్లు.
ఈ కేటుగాళ్లు జనాలను ఆకర్షించడం కోసం ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ఫొటోని వాడుకుంటున్నారు. హర్షసాయి ఫొటో చూసి చాలా మంది మోసపోతున్నారు. ఆయా కంపెనీలు, సదరు వ్యక్తులు నిజమైన వాళ్లే అనుకుని నమ్ముతున్నారు. వర్క్ కోసం వారిని కాంటాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో కేటుగాళ్లు.. ముందు తమకు కొంత డబ్బు కట్టాలని ఆ తర్వాత పని ఇస్తాం అంటున్నారు. ఇక వీరు చెప్పే మొత్తం కూడా కాస్త తక్కువే ఉండటంతో జనాలు అధిక సంఖ్యలో నమ్మి.. మోసపోతున్నారు. కొన్ని సందర్భాల్లో.. ఈ చిన్న మొత్తాలు కోట్ల రూపాయలు వుతున్నాయి.
అయితే తన పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హర్షసాయి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఎన్నో వీడియోల్లో జాగ్రత్త అంటూ తన సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్‌ను అలర్ట్ చేశాడు. ఒకసారి అయితే ఏకంగా మోసపోయిన బాధితులతోటే వీడియో చేశాడు. దీనిలో వారు ఎలా మోసపోయారు.. ఎంత లాస్ అయ్యారో చెప్పుకొచ్చారు బాధితులు. దయచేసి తన పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హర్షసాయి ఎన్ని సారు.. ఎన్ని వీడియ్లో చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఏదైన యూట్యూబ్ చానెల్ మీద హర్ష సాయి ఫొటో కనిపించడమే ఆలస్యం.. వెంటనే స్పందించి.. భారీగా మోసపోతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హర్ష సాయి సూచించాడు. మరి హర్ష సాయి పేరుపై జరుగుతున్న మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.