మితిమీరిన వేగంతో బైక్ నడిపి ఓ ఫేమస్ యూట్యూబర్ అక్కడిక్కడే మృతి చెందాడు.
ప్రముఖ యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్, బైక్ వ్లాగర్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆగ్రా నుంచి రేసింగ్ బైక్ పై న్యూఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యూట్యూబర్లతో మీటింగ్ కోసమని ఢిల్లీ వచ్చిన బైక్ రైడర్ ప్రమాదవశాత్తు డివైడర్ ను గుద్దుకుని స్పాట్ లోనే చనిపోయాడు. గంటకు 300 కి.మీ. వేగాన్ని అందుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదం సంభవించింది. అతని పేరు అగస్త్య చౌహాన్. వయసు 22 ఏళ్ళు. ఒక ప్రొఫెషనల్ బైకర్. బైక్ పై సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాడు. ‘ప్రో రైడర్ 1000’ అనే యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నాడు.
కవాసకి నింజా జడ్ ఎక్స్ 10 ఆర్ బైక్ పై ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నుంచి ఢిల్లీ బయలుదేరాడు. అయితే మొదటిసారిగా తన బైక్ పై గంటకు 300 కి.మీ. వేగాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యమునా ఎక్స్ ప్రెస్ వే 46వ పాయింట్ వద్ద నియంత్రణ కోల్పోవడంతో డివైడర్ ను ఢీకొన్నాడు. దీంతో అగస్త్య చౌహన్ అక్కడిక్కడే మృతి చెందారు. స్నేహితులతో కలిసి ఢిల్లీ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు చౌహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అగస్త్య చౌహాన్ స్వస్థలం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్. ఇతని తండ్రి జితేంద్ర చౌహన్. ఈయనొక రెజ్లర్. రెజ్లింగ్ లో ఎన్నో మెడల్స్ సాధించారు.
తండ్రిలానే ఏదో సాధించాలన్న తపనతో బైక్ రైడర్ గా పని చేస్తున్నాడు అగస్త్య. దురదృష్టవశాత్తు 300 కి.మీ. ఫీట్ ని అందుకునే క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యూట్యూబర్స్ మీటింగ్ కోసమని డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వచ్చాడు అగస్త్య. సమావేశానికి ముందు నలుగురు బైక్ రైడర్లు యమునా ఎక్స్ ప్రెస్ వే మీద రైడ్ చేయడానికి వెళ్లారు. ఆగ్రా వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. 200 కి.మీ. కంటే వేగంతో వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొనడంతో అగస్త్య హెల్మెట్ ముక్కలైంది. రోడ్డుకు అగస్త్య తల గట్టిగా తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అగస్త్య చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
300KM/घंटा की स्पीड पर थी कावासाकी: डिवाइडर से टकराई बाइक: यूट्यूबर अगस्त्य चौहान ने मौके पर तोड़ा दम: https://t.co/Im3m2cTe0y#prorider1000 #AgastyaChauhan #kawasaki #agastaychauhan #dehradun #HimachalPradesh pic.twitter.com/icurQYl1sP
— Jayprakash Tomar (@tomar_pee) May 3, 2023