ఇటీవల సినిమా ఇండస్ట్రీలో భాజా, భజంత్రీల సందడి నెలకొంది. యంగ్ హీరో, హీరోయిన్లు మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ అంతా ఫ్యామిలీ లైఫ్ వైపు వెళుతున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ టాలెంట్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యాడు
ఇటీవల సినిమా ఇండస్ట్రీలో భాజా, భజంత్రీల సందడి నెలకొంది. యంగ్ హీరో, హీరోయిన్లు మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ అంతా ఫ్యామిలీ లైఫ్ వైపు వెళుతున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ టాలెంట్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. నితిన్, నిఖిల్, స్వర్ణా భాస్కర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, అతియాశెట్టి వంటి వారు మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. అదేవిధంగా టాలీవుడ్ హ్యాండ్సమ్ శర్వానంద్ కూడా వచ్చే నెలలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్, తమిళ నటుడు ఎరుమ సాని విజయ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు.
హిప్ హాప్ ఆది డైరెక్ట్ చేసిన ‘మీసై మురుకు’ చిత్రంతో నటుడిగా వెండితెరపై రంగప్రవేశం చేశాడు ఎరుమ సాని విజయ్. తర్వాత నాన్ సిరితతాల్ సినిమాలో నటించాడు. అనంతరం సైకో థ్రిల్లర్ మూవీ డీ బ్లాక్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇందులో అరుళ్ నిధి, అవంతిక మిశ్ర హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అరుళ్ నిధి ఫ్రెండ్ పాత్రలోనూ మెరిశాడు విజయ్. మోడల్ నక్షత్రతో ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నాడు. ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. వీరి పెళ్లికి సెలబ్రిటీలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంగేజ్‌మెంట్ దగ్గరి నుంచి పెళ్లి వరకు ప్రతి ఈవెంట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నటుడు. కాగా విజయ్‌కు ఎరుమై సాని అని సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అతడు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ విశేష అభిమానులను సంపాదించుకున్నాడు.