పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సమ్రిన్. ఆమెకు రఫీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, రాను రాను భర్త భార్యతో మాట్లాడడం మానేశాడని సమాచారం. ఇక ఇదే కోపంతో భార్య భర్తపై దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
బంధువుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లతో ఒక్కటైన వివాహ బంధాలు అన్నీ చివరి వరకు వెళ్లడం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు, వివాహేతర సంబంధాలు., ఇలా రక రకాల కారణాలతో చివరికి హత్యలు, ఆత్మహత్యలు లేక విడాకులు తీసుకుని వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నారు. సరిగ్గా ఇలాగే భర్తపై కోపంతో ఊగిపోయిన ఓ భార్య.. ప్రతీకారం తీర్చుకునేందుకు ఏకంగా కట్టుకున్న మొగుడిపై దారుణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే?
మైసూర్ లోని నాచనహళ్లిపాళ్యలో రఫీ, సమ్రిన్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల కాపురం సజావుగానే సాగింది. కానీ, రాను రాను భర్త భార్యతో పూర్తిగా మాట్లాడడం లేదని భార్య తరుచు బాధపడేది. ఇదే విషయమై గతంలో భార్యాభర్తలు అనేకసార్లు గొడవ పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తరుచు గొడవలు జరుగుతుండడంతో సమ్రిన్ తీవ్ర మనోవేదనకు గురై నాతో మాట్లాడని భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందు కోసం భార్య ప్రతీ అమవాస్య రోజు ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకమ, మిరపకాయలతో క్షుద్రపూజలు చేయిస్తుండేది.
ఇక ఎప్పటిలాగే ఈ మంగళవారం అమవాస్య నాడు కూడా సమ్రీన్.. భర్త రఫీపై నాచనహళ్లిపాళ్యలోని 8వ క్రాస్ లో క్షుద్రపూజలు చేయించిది. దీంతో అనుమానం వచ్చిన రఫీ కుటుంబ సభ్యులు సమ్రిన్ ను క్షుద్రపూజలు చేయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భర్తపై క్షుద్రపూజలు చేయించిన ఈ భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.