ధనవంతులకు లోన్ ఇవ్వడంలో ఎలాంటి అలసత్వం చూపించరు బ్యాంక్ అధికారులు. డాక్యుమెంట్లు కొంచెం అటుఇటుగా ఉన్నా.. లోన్ మంజూరు చేస్తారు. అయితే సామాన్యుల విషయంలో లోన్ లభించడం అంత ఈజీ కాదు! తమ పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికి కొన్నిసార్లు బ్యాంకు చుట్టూ తిరుగుతుండాలి. బ్యాంకు అధికారులు పెట్టే కండిషన్లు, కొన్ని అభ్యంతరాలు సామ్యానుడిని తీవ్ర అసహనానికి గురిచేస్తుంటాయి. తాజాగా అలా అసహనానికి గురైన ఓ వ్యక్తి బ్యాంక్ ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళ్తే..
వసీం అక్రమ్ ముల్లా అనే వ్యక్తి హవేరి జిల్లా బైడగి తాలూకా సమీపంలోని హెడిగొండ గ్రామంలోని ఓ బ్యాంక్కు వెళ్లి రుణం కావాలని బ్యాంక్ మేనేజర్ ను అడిగాడు. వివిధ కారణాల రీత్యా మేనేజర్ లోన్ ను నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడు అయిన వసీం పెట్రోల్ తీసుకుని బ్యాంక్ దగ్గరికు వచ్చాడు. అక్కడ ఉన్న కిటికీ అద్దాలను బద్దలు కొట్టి లోపల పెట్రోల్ చల్లి.. నిప్పంటించాడు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేశారు.సదరు వ్యక్తి లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న బ్యాంక్ తన లోన్ అప్లికేషన్ ను తిరస్కరించిందని ఆ కోపంతోనే బ్యాంక్ ను తగలబెట్టానని పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే ఈ ఘటన వెనక బ్యాంక్ లో పనిచేస్తున్న కొందరి ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చాలా వరకు కంప్యూటర్లు, ఫర్నిచర్, కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి. లాకర్ లో ఉన్న డబ్బు, నగలు భద్రంగా ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.