అనుమానం పెనుభూతం అన్న నానుడి అందరికీ బాగా తెలుసు కదా. ఆ ఒక్క అనుమానం అనే చిన్న విత్తనం మనసులో నాటుకుంటే.. అది పెరిగి వృక్షమై పచ్చటి సంసారాలను కబళించి వేస్తుంది. హాయిగా సాగిపోయే కుటుంబంలో ఆరని చిచ్చులు రేపుతుంది. ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధం, అనుమానం ఈ రెండు కారణాల వల్ల జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ కలచి వేస్తోంది. భార్యపై అనుమానంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న దారుణం ఇప్పుడు సేలం జిల్లాలో చోటుచేసుకుంది.
సేలం జిల్లాలో మురుగన్(33) అనే వ్యక్తి మరుగేశ్వరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి తొమ్మిదేళ్ల బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. మురుగున్ ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఓ రోజు రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా ప్రమాదానికి గురయ్యైన మురుగన్ పది రోజులు ఇంటికే పరిమితమయ్యాడు. మొదటి నుంచి మురుగన్‌కు అతని భార్యపై అనుమానం ఉండేది. అతను ఇంట్లో ఉండగానే ఆమె గంటలకొద్దీ ఎవరితోనే ఫోన్లో మాట్లాడిందని ఆరోపించాడు. ఓరోజు ఫోన్ మాట్లాడుతున్న మురుగేశ్వరిని అడ్డుకోవడంతో వారిద్దరికీ మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. కోపంలో మురుగున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
ఓ రోజు మురుగన్ తన భార్య ఫోన్ తీసుకుని దగ్గర్లోని దుకాణంలో ఇచ్చాడు. తర్వాత కుమారుడు, కుమార్తెను తీసుకుని మామిడి తోటకు వెళ్లాడు. ఇద్దరు పిల్లలను మామిడి చెట్టుకు ఉరేశాడు. పిల్లలు విలవిల్లాడుతూ చనిపోయారు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. చివర్లో తన భార్యను ఉద్దేశించి ‘నీకు కావాల్సింది ఇదేగా.. మేము చావడమేగా నీకు కావాల్సింది. అలాగే చచ్చిపోతున్నాం ఉంటూ మాట్లాడాడు. ఆ దృశ్యాలను తన దగ్గరి బంధువుకు పంపగా విషయం తన భార్యకు కూడా తెలిసింది. వాళ్లు వెంటనే పోలీసులను సంప్రదించగా పోలీసులు ఘటనాస్థిలికి చేరుకున్నారు. అప్పటికే ముగ్గురూ చనిపోయి ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సెప్టెంబర్ 26న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అక్రమ సంబధాలు, అనుమానాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? దంపతులకు గొడవలు జరిగితే చిన్నారులను ఎందుకు బలి తీసుకుంటున్నారన్నది అందరి మనసులు తొలుస్తున్న ప్రశ్నలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.