ప్రేమలో ఎంత మాధుర్యం ఉంటుందో అది వికటిస్తే అంతకంటే దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆనందంగా ఉంటున్న సమయంలో అభిప్రాయ భేదాలు, అక్రమ సంబంధాలతో నూరేళ్ల జీవితాలు మధ్యలోనే అత్యంత దారుణంగా ముగుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువతి ప్రియుడి చేతిలో బుధవారం అత్యంత దారుణంగా హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పప్పు గఢేవల్, మాలిని (పేరు మార్చాం) ఇద్దరు ప్రేమించుకుని ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మాలిని వీరా అనే మరో యువకుడితో మాట్లాడుతుండాన్ని గమనించిన పప్పు, అలా చేయవద్దని మాలినిని చాలా సార్లు వారించాడు.
అయిన ఆమె అతని హెచ్చరికను పట్టించుకోలేదు. దాంతో పక్కా పథకం ప్రకారం రాత్రి పూట మాలిని నిద్రిస్తున్న సమయంలో బండరాయితో మాలిని తలపై బాది హత్య చేశాడు. ఉదయం యధావిధిగా తన పనికి తాను వెళ్లిపోయాడు. హత్య విషయం స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు వచ్చి చూడగా మాలిని రక్తపు మడుగులో పడి ఉంది. మొఖం ఛిద్రమై ఉంది. దారుణ విషయం ఏంటంటే ఆ యువతి ప్రైవేట్ పార్ట్స్ లో కారం పెట్టి ఉందని పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన స్థలంలో ‘ప్యార్ మే ధోకా’(ప్రేమలో మోసం) అని రాసి ఉన్న కాగితం పోలీసులకు లభించింది. అందులో వీరా అనే పేరు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు స్థానికులను విచారించగా షాలినీని చివరి సారిగా పప్పుతో చూసినట్టు వారు చెప్పారు. దీంతో పోలీసులు పప్పు కోసం గాలించి, పట్టుకున్నారు. ఇంట్రాగేషన్లో మాలినిని తానే హత్య చేశానని పప్పు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.