సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. ఎవరూ చేయని విధంగా తమ టాలెంట్ తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా తమ టాలెంట్ తో లిమ్కా అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డులు సైతం కైవసం చేసుకుంటున్నారు.
ఈ మద్య కాలంలో ఎలాంటి ఫంక్షన్స్ లో అయినా సరే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు మెహిందీ వేసుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. మెహందీ అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. పెళ్లిళ్ల సమయంలో మెహందీ వేడుక ఒకరోజు ట్రెడిషన్ గా నడుస్తుంది. పండుగ సమయాల్లో అమ్మవారి పూజలు చేసేటప్పుడు గోరింటాకు పెట్టుకుని నిండు ముత్తైదువలు అమ్మవారిని కొలుచుకుంటారు. ఇలా ప్రత్యేక రోజుల్లో మెహందీ డిజైన్ వేసుకోవడం పరిపాటిగా మారింది. హైదరాబాద్‌లో ఓ అమ్మాయి మెహందీతో అరుదైన రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆ అరుదైన రికార్డు ఏంటా అనకుంటున్నారా.. పూర్తి వివరాల్లోకి వెళితే..
పద్యప్రదేశ్ జబల్‌పుర్‌కు చెందిన అనుశ్రీ విశ్వకర్మ హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస‍్తుంది. చిన్నప్పటి నుండి క్రాఫ్టింగ్ పై ఆసక్తి ఉండడం వల్ల మెహందీ డిజైన్ పై దృష్టి సారించింది. తల్లి వద్ద క్రాఫ్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని తనలోని నైపుణ్యానికి పదును పెట్టడం మొదలు పెట్టింది. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం వచ్చింది. ఇదే సమయంలో తన టాలెంట్ ని నిరూపించుకోవాలని భావించింది. అద్భుతమైన మెహందీ డిజైన వేసి కేరళాకు చెందిన ఓ మహిళ రికార్డు సృష్టించింది. కేరళ మహిళ రికార్డు అనుశ్రీని ఆకట్టుకుంది. తనకు ఎలాగూ మెహందీ డిజైన్ లో ప్రావిణ్యం ఉండటం వల్ల తాను కూడా ఎదో ఒక వండర్ క్రియేట్ చేయాలని భావించింది. 6 గంటల్లో 6 మీటర్ల వస్త్రంపై సీతారాముల బొమ్మను వేసి అందరి దృష్టి ఆకర్షించింది.
మెహందీలో అద్భుతమైన ప్రతిభ కనబరచిన అనుశ్రీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్లేస్ సంపాదించింది. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ.. ‘మా అమ్మ నుంచి నాకు ఈ ప్రేరణ లభించింది. ఆమె గత 30 సంవత్సరాలుగా క్రాఫ్టింగ్ శిక్షణ ఇస్తోంది. మొదట్లో చదువు, ఉద్యోగం కోసం నేను బయటనే ఎక్కువ గడిపేదాన్ని.. కోవిడ్ పరిస్థితుల తర్వాత వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ సమయంలో ఏదైనా ప్రత్యేకంగా చేసి రికార్డ్ సాధించాలనుకున్నాను. అందుకోసం ముందున్న రికార్డ్‌లు పరిశీలించాను. మా రాష్ట్రం నుంచి ఒక్క రికార్డ్ కూడా లేదు. దీంతో నేను ఎందుకు రికార్డు్ సృష్టించకూడదు అనుకుని సాధించాను’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అరుదైన రికార్డ్ సాధించిన అనుశ్రీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.