పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కల్యాణి. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయి గురించి ఊళ్లో జనాలు అలా అనుకుంటున్నారని తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ యువతి పేరు కల్యాణి. ప్రస్తుతం డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. అయితే నా గురించి ఊళ్లో జనాలంతా ఓ రకంగా అనుకుంటున్నారని, ఇలాంటి బతుకు నాకు వద్దు. అందుకే దూరంగా వెళ్లి చనిపోవాలనుకుంటున్నా.. అంటూ ఓ యువతి లెటర్ రాసి ఇంట్లో పెట్టి కనిపించకుండాపోయింది. తాజాగా మహబూబాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురం. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న కృష్ణ అనే వ్యక్తికి కల్యాణి అనే కూతురు ఉంది. ఈ అమ్మాయి వరంగల్ లోని ఓ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. ఇదిలా ఉంటే ఈ యువతి గత రెండు మూడు నెలల నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలోనే ఊళ్లోఉండే కొందరు జనాలు.. చదువు రాదని, ఆ పిల్లతో ఏం కాదని ఓ ప్రచారం చేస్తున్నారని కల్యాణి తెలుసుకుందట.
ఈ ప్రచారంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఈ సమయంలోనే కల్యాణి ఓ నిర్ణయం తీసుకుంది. ఈ చదువులు నాతో కావడం లేదు. నా గురించి ఊళ్లోజనాలు చదువు రాదు, నేనేం చేయాలేను అని అనుకుంటున్నారు. అందుకే నేను దూరంగా వెళ్లిపోయి చనిపోవాలని అనుకుంటున్నాను. నేను ఎవరినీ ప్రేమించలేదు, ఎలాంటి తప్పు కూడా చేయలేదు అంటూ.. ఆ యువతి లెటర్ రాసి ఇంట్లో పెట్టి ఈనెల 9న కనిపించకుండాపోయింది.
అయితే సాయంత్రం అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. దీంతో స్థానిక ప్రాంతాల్లో వెతికారు. కానీ, కూతురు ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఆ సమయంలో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్యాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ యువతి ఎవరికైన కనిపిస్తే.. 9440795241, 738293503 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఉన్నట్టుండి కూతురు ఇలా చేయడంతో కల్యాణి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇలా చిన్న చిన్న సమస్యలకే చావే పరిష్కారం అనుకుంటున్న ఇలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.