దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే కొంత మంది మృగాళ్లు మానవ సంబంధాలు మరచి దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు.. బాలిక ఎదురు తిరగడంతో హత్యచేశాడు. మద్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఇది చదవండి: పెళ్లి చేసుకున్న వారానికే ఆత్మహత్యకు పాల్పడిన వధువు
మద్యప్రదేశ్ లోని గుణ జిల్లా 40 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కూతురుపైనే కన్ను వేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరలోని అడవిలోకి తీసుకు వెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడు.. కానీ ఆ బాలిక ఎదురు తిరిగి ఇంట్లో చెప్తానని బెదిరించడంతో మృగంగా మారాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆ బాలికను చంపేశాడు. ఏమి తెలియనట్లుగా ఇంటికి తీసుకు వెళ్లి తన కూతురు చనిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఇది చదవండి: ఉక్రెయిన్ లో మార్షల్ లా! మొదలైన ఎదురుదాడులు!
బాలికను చనిపోయిన తీరు చూసిన పోలీసులకు అనుమానం రావడంతో తమదైన స్టైల్లో తండ్రిని ప్రశ్నించారు. దీంతో తానే చంపి.. డెడ్ బాడీని అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సంబంధ బాంధవ్యాలు మరచి కన్న కూతురు అని కూడా చూడకుండా చంపి అత్యాచారం చేసి ఆ కసాయి తండ్రికి ఉరిశిక్ష విధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.