crime news : సమాజం తలదించుకునేలాంటి ఘటనలు నిత్యం దేశంలో ఎన్నో కొన్ని జరుగుతూనే ఉన్నాయి. కొందరు కామాంధులు వావివరసలు మర్చిపోయి మరి బరి తెగిస్తున్నారు. తాజగా, ఓ ఇద్దరు కామాంధులు అక్క వరసయ్యే మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించి పారిపోవటానికి ప్రయత్నించటంతో రోడ్డుపై పడేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, శివపురి జిల్లా, నర్‌వార్ టౌన్‌కు చెందిన జితేంద్ర, రమేష్ కుశ్వాహ అన్నదమ్ములు. వీరి కన్ను అక్క వరసయ్యే మహిళపై పడింది. గత కొద్దిరోజులనుంచి ఆమెపై ఓ కన్నేసి ఉంచి అంతా గమనిస్తూ ఉన్నారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
శనివారం ఆమె మేకలు కాయటానికి అడవిలోకి వెళ్లింది. ఇద్దరూ ఆమెను ఫాలో అయ్యారు. ఆమెపై అత్యాచారం చేయటానికి ప్రయత్నించారు. తప్పించుకుని రోడ్డుపైకి పరిగెత్తింది. వెంటనే వాళ్లు ఆమెను పట్టుకున్నారు. కామాంధుల తల్లి కూడా అక్కడికి వచ్చింది. పోలీస్ స్టేషన్‌కు పోతే చంపుతామని బెదిరించారు. ఆమె ఇందుకు భయపడలేదు. కంప్లైంట్ చేస్తానని అంది. దీంతో వారు విచక్షణ రహితంగా ఆమెను కొట్టారు. బట్టలు కూడా చింపేశారు. దారిని పోయేవారు వేడుక చూశారే గానీ, ఒక్కరు కూడా సహాయం చేయటానికి రాలేదు. అయితే, ఆ మహిళ దెబ్బలుతిన్నా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. వారిపై కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంతో తెలియజేయండి.
MP: शिवपुरी जिले से रिश्तों को शर्मसार करने वाली खबर आई है. यहां चचेरे भाइयों ने महिला से छेड़छाड़ कर दी. बहन ने विरोध किया तो भाइयों ने उसे जमकर पीटा. उस पर थप्पड़, डंडे-जूतों का बरसात कर दी. इतना ही नहीं, युवकों ने उसे सड़क पर घसीटा और कपड़े भी फाड़ दिए. पुलिस ने महिला की pic.twitter.com/J0GakP5AP2
— Sushil Kaushik (@SushilKaushikMP) March 20, 2022
ఇవి కూడా చదవండి : ఎదురింటి యువకుడితో భార్య సంబంధం.. ఇంటికొచ్చి గొడవ చేయటంతో
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.