చిన్నా, పెద్ద అనే తేడాలు లేకుండా వావివరసలు మరచిన నేటి సమాజ పొకడలు చూస్తుంటే మనం ఉండేది.. అడవిలోనా, సమాజంలోనా అనే అనుమానం కలగకమానదు. రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు భారతీయ వివాహ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ లో చోటుచేసుకున్న ఓ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని నవమాసాలు మోసి, కని, పెంచిన కొడుకునే చంపింది ఓ నికృష్టపు తల్లి. స్టానికంగా ఈ వార్త తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ కు చెందిన దాయమ్మకు హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన పాపయ్యతో 30 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. పాపయ్య-దాయమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు వెంకటేష్ ఉన్నారు. అనారోగ్యంతో పాపయ్య 10 ఏళ్ల కిందట మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న దాయమ్మకు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దాంతో తరచు వీళ్ళిద్దరు కలుసుకునేవారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం కాస్త దాయమ్మ కొడుకు వెంకటేష్ కు తెలిసింది. దాంతో తల్లితో శ్రీనివాస్ తో తరచూ గొడవలు పడుతూండేవాడు. వెంకటేష్ పదే పదే తమ సంబంధానికి అడ్డు తగులుతుండటంతో ఎలాగైన అతడి అడ్డు తొలగించుకోవాలిన దాయమ్మ తన ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి ప్లాన్ వేసింది.
తమ ప్లాన్ లో భాగంగానే మంగళవారం రాత్రి కొడుక్కు ఫుల్లుగా మందు తాగించింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు పై ప్రియుడితో కలిసి తలపై కర్రతో గట్టిగా కొట్టింది. దాంతో అక్కడికక్కడే వెంకటేష్ చనిపోయాడు. శవాన్ని దగ్గరలో ఉన్న మోతుకులకుంటలో పడేశారు. శవాన్ని నీళ్లలో పడేయడానికి శ్రీనివాస్ అల్లుడు నర్సిమ్ములు సైతం సహకరించాడు. ఆ తర్వాత తనకేమీ తెలియదు అన్నట్లుగా బుధవారం తన కొడుకు కనపడట్లేదు అని కన్నీరు పెట్టసాగింది. గ్రామస్తులంతా వెంకటేష్ ను వెతికే పనిలో ఉండగానే దాయమ్మ ప్రియుడితో కలిసి ఊరు విడిచి పారిపోయింది. గ్రామస్తులు కుంటలో శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాయమ్మ, శ్రీనివాస్, నర్సిమ్ములపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పడక సుఖం కోసం కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న తల్లిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.