ప్రస్తుతం సమాజంలో చాలా మందికి పెళ్లి, భర్త, భార్య, పిల్లలు, వైవాహిక జీవితం, కుటుంబం, పరువు ఇలాంటి పదాలకు అసలు అర్థం కూడా తెలియదు అనిపిస్తూ ఉంటుంది. నేను అనుకుంది జరగాలి.. అందుకు ఏదైనా చేస్తా అనే ధోరణి కలిగిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది అయితే పెళ్లి బంధాన్ని అపహాస్యం చేస్తూ తుఛ్యమైన సుఖాల కోసం కుటుంబ వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నారు. అలా ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ క్రైమ్ కథా చిత్రమ్ ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. కాలేజీ రోజుల్లో అలవాటు పడిన జీవితాన్ని వదులుకోలేక కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. తన విలాసాలే ముఖ్యంగానీ, తాళి కట్టిన భర్త ఏమైతే నాకేంటని అనుకుంది. పక్కా పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను పైలోకానికి పంపింది. ఇప్పుడు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది.
శ్వేతకు కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్‌తో వివాహం జరిగింది. వాళ్లిద్దరూ కర్ణాటక రాష్ట్రం యలహంక కొండప్పలేఔట్‌లో నివాసం ఉండేవారు. అక్టోబర్ 22న వారి ఇంటి మేడపై చంద్రశేఖర్ శవమై తేలాడు. అతని తలపై రాడ్డుతో కొట్టి.. మర్మాంగాన్ని కత్తిరించి అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త మృతదేహాన్ని చూసి శ్వేత గుండెలు పగిలేలా రోధించింది. తన భర్తను ఎవరు హత్యచేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతా అతడిని ఎవరు చంపి ఉంటారో తెలియక జుట్టు పట్టుకున్నారు. పోలీసులకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. కానీ, అక్కడ క్రైమ్ జరిగిన తీరు చూస్తే.. భార్య మీదే అనుమానం ఎక్కువైంది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
విషయం ఏంటంటే.. శ్వేత మైండ్ సెట్ మొత్తం వేరు. కష్టపడి చదువుకోవాలి, లైఫ్‌లో సెటిల్ కావాలి, నా కాళ్లపై నేను నిలబడాలి, పెళ్లి చేసుకుని చక్కని కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలి.. ఇలా అనుకునే అమ్మాయి అస్సలు కాదు. సినిమాలు, సీరియల్స్ చూస్తూ తనని తాను ఎంతో మార్చుకుంది. లైఫ్ అంటే విలువలతో పనిలేదు.. విలాసాలే ముఖ్యమని గట్టిగా నమ్మింది. ఎంత ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే.. అంత ఎక్కువ అవకాశాలు, సదుపాయాలు ఉంటాయని నమ్మింది. బెంగళూరులో ఎంసీఏ చదివే రోజుల్లోనే 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మెయిన్‌టైన్ చేసింది. ఒకరితో పరిచయం ఏర్పరుచుకోవడం వారితో ఇష్టారీతిన తిరగడం, సినిమాలు, షికార్లు చేయడం. బోర్ కొట్టిన తర్వాత అతని నంబర్‌ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం. ఇలా మొత్తం 15 మందిని మెయిన్‌టైన్ చేసింది. అంతేకాకుండా ఇంటి ఓనర్ కుమారుడు సురేశ్‌తో కూడా పరిచయం ఏర్పడింది. అతనితో కూడా కాలేజీకి బైక్‌పై వెళ్లడం, ఎంజాయ్ చేయడం చేసింది.
పెళ్లి తర్వాత కూడా సురేశ్‌తో ఆ చీకటి బంధం కొనసాగిస్తూనే ఉంది. భర్తను మభ్య పెడుతూ ఎఫైర్స్ నడిపిస్తూ వచ్చింది. అయితే ఈ విషయాలు మొత్తం భర్తకు తెలిశాయి. శ్వేతను నిలదీశాడు. అది కరెక్ట్ కాదని వాదించాడు. పద్ధితి మార్చుకోవాలని మందలించాడు. అయితే అక్కడే శ్వేతకు అహం దెబ్బతింది. ఆమె అలాంటి విలాసాలకు అలవాటు పడిపోయింది. తనకు కుటుంబం, భర్త అన్నింటి కంటే తాను కోరుకున్న జీవితమే ముఖ్యం అనుకుంది. నిజానికి చంద్రశేఖర్‌ని చంపాలని ఆమె అనుకోలేదు. అతను ఆమె పద్ధతి మార్చుకోవాలని పట్టుబట్టడం వల్లే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ ప్రకారం భర్తను హత్య చేయించింది. కానీ, పోలీసులకు దొరికిపోయి ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తోంది. అటు ప్రియుడు సురేశ్ కూడా చీకటి సుఖాలకు అలవాటు పడి శ్వేత చెప్పింది చేశాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు.