నేటి సమాజంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని కాపురాన్ని చేజేతులా కూల్చేసుకుంటున్నారు. కొందరు మహిళలు అయితే ఇంట్లో ఉన్న రుచి నచ్చక పక్కంట్లో రుచి చూసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇలా అక్రమ సంబంధాల కోసం కాలు జారి చివరికి బొక్కబోర్లపడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండ్యా జిల్లాలోని ఓ ప్రాంతంలో శిల్ప(26), మహేష్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. స్థానికంగా పని చేస్తూ ఈ దంపతులు కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ భార్య శిల్ప హద్దులు దాటి వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేసింది. అయితే శిల్పకు సమీప బంధువైన బాలాజీ అనే వ్యక్తితో పరిచయం పెరిగింది. ఆ పరిచయమే రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో శిల్ప ఎంచక్కా భర్తకు మస్కా కొట్టి ప్రియుడితోనే ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత భార్య సాగిస్తున్న చీకటి కాపురాన్ని భర్త ఎట్టకేలకు పసిగట్టాడు. పద్దతి మార్చుకోవాలంటూ భర్త మహేష్ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడే శిల్పకు భర్తపై ఎక్కడ లేని కోపం దూసుకొచ్చింది. ప్రియుడితో అడ్డుగా ఉండడమే కాకుండా, తనకు వార్నింగ్ ఇవ్వడం శిల్పకు నచ్చలేదు.
ఈ సమయంలోనే శిల్పకు విషపు ఆలోచనలు మొలిచాయి. ఎలాగైన సరే భర్తను హత్య చేయాలని ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే ప్రియుడు బాలాజీతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం భర్త శవాన్ని ప్రియుడు బలాజీతో కలిసి రాత్రికి రాత్రే దహనం చేసింది. ఆ తర్వాత శిల్ప నా భర్తది సహజ మరణమేనని అత్తింటివాళ్లను నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో అత్తింటి వాళ్లు సైతం నిజమేనని నమ్మారు. ఇక అప్పటి నుంచి శిల్ప కొననుకుంటే సమీపంలో ఓ కొబ్బరి తోటలో ఆమె తల్లి కెంపదేవమ్మతో కలిసి ఉంటుంది.
ఈ క్రమంలోనే మహేష్ సోదరుడికి తన అన్న మరణంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహేష్ ను హత్య చేసింది ఎవరో కాదు.. భార్య శిల్పేనని తేలడంతో అత్తింటి కుటుంబ సభ్యులు అంతా నోళ్లు తెరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తన పడక సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన శిల్ప దారుణంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.