ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు. జీవితంలో ఎదగాలన్న ఆశయం ముందు ఆమెకు పెళ్లి కాస్త చిన్నది అనిపించింది. అందుకే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఎంత మొత్తుకున్నా వారి మాటలు పెడచెవిన పెట్టింది. జీవితంలో తల ఎత్తుకుని ఉన్నతమైన హోదాలో ఉండాలన్న తన ఆశయం కారణంగానే పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ బంధువులు మాత్రం ఇలా చేస్తే నీకు జీవితంలో పెళ్లి కాదు అని ఆటపట్టించారు. అలా సరదాగా అన్న మాటలకే తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువతి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరులోని గిరివనగర్ లో సుమిత్ర అనే యువతి ప్రశాంత్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తుంది. అలా వయసు మీద పడుతున్నా ఆమెకు పెళ్లి కాలేదు. దీంతో సుమిత్ర తల్లిదండ్రులు, బంధువులు పెళ్లి చేసుకోవాలంటూ పదే పదే పట్టుబట్టారు. కానీ జీవితంలో ఎదగాలి కాబట్టి ఇప్పుడే పెళ్లి చేసుకోనంటూ యువతి తల్లిదండ్రులకు ముక్కుసూటిగా చెబుతుండేది. కానీ బంధువులు మాత్రం ఇలా చేస్తే నీకు జీవితంలో పెళ్లి జరగదు అని అంటుండేవారు.
దీంతో తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. దీంతో ఎప్పటి లాగే ఆ యువతి మళ్లీ అదే ఆస్పత్రిలో విధుల్లోకి వెళ్లింది. ఆస్పత్రిలో తన సహోద్యోగులు పెళ్లి ఆగిపోయిందా అంటూ ఆటపట్టించారు. వారి మాటలను జీర్ణించుకోలేకపోయిన సుమిత్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే గురువారం రాత్రి తను ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: అందమైన అమ్మాయిల పేరుతో అర్థరాత్రి మెసెజ్! సీన్ కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!