మరో కొన్ని రోజుల్లో పెళ్లి. ఇంతలోనే ఆ యువతి కాబోయే భర్తకు ఫోన్ చేసి పార్క్ కు వెళ్దామని నమ్మించి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక రీల్స్ చేద్దామని అతని చేతులను తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత ఆ యువతి కత్తితో కాబోయే భర్తను పొడిచి పరారైంది. అసలు ఆ యువతి కాబోయే భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలిస్తే షాకవుతారు.
మరో కొన్ని రోజుల్లో పెళ్లి. ఇంతలోనే ఆ యువతి కాబోయే భర్తకు ఫోన్ చేసి పార్క్ కు వెళ్దామని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలసి దగ్గరలో ఉన్న ఓ పార్కుకు వెళ్లారు. అక్కడికి సరదాగా ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే ఆ యువతి కాబోయే భర్తను కత్తితో పొడిచింది. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ యువతి కాబోయే భర్తను ఎందుకు కత్తితో పొడిచింది. ఆ యువకుడిని ఎందుకు చంపాలనుకుంది? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక హవేరి జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే కూతురుకి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని అనుకున్నారు. ఇందుకోసం హర్పనహళ్లి ప్రాంతానికి చెందిన దేవేంద్రగౌడ అనే యువకుడితో మార్చి 3న నిశ్చితార్థం జరిపించారు. ఇక పెళ్లి కూడా తొందరలోనే ఉండడంతో వివాహ పనుల్లో బిజీగా మారిపోయారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆ యువతి కాబోయే భర్తకు ఫోన్ చేసి ఇద్దరం పార్కుకు వెళ్దామని చెప్పింది. కాబోయే భార్య బయటకు రమ్మనడంతో దేవేంద్రగౌడ పట్టలేని అనందంతో మురిసిపోయాడు.
అనుకున్నట్లుగానే ఆ యువతి తనకు కాబోయే భర్తతో పార్క్ కు వెళ్లి అతనితో కొద్దిసేపు సరదాగా గడుపుతున్నట్లు నటించింది. అయితే ఈ క్రమంలోనే ఆ యువతి రీల్స్ చేద్దామని, నువ్వు చేతులు తాళ్లతో కట్టుకుని ఉంటే నేను వీడియో తీస్తానని చెప్పింది. ఆమె చెప్పినట్టే దేవేంద్రగౌడ సరేననడంతో ఆ యువతి అతని చేతులను తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత అటు వైపుకు తిరగమని చెప్పడంతో అతడు ఆమె చెప్పినట్టే చేశాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న ఆ యువతి.. వెంట తెచ్చుకున్న కత్తితో కాబోయే భర్త మెడపై పొడిచింది. దీంతో యువకుడు పెద్దగా అరవడంతో పార్క్ లో ఉన్న అందరూ పరుగు పరుగున వచ్చారు. వీరిందరినీ చూసి ఆ యువతి అక్కడి నుంచి పరారైంది.
అనంతరం కొంతమంది దేవేంద్రగౌడను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రిలో ఉన్న దేవేంద్రగౌడను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక జరిగిన దారుణంపై దేవేంద్రగౌడ కుటుంబ సభ్యులు ఆ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఆ యువతి సంచలన నిజాన్ని బయటపెట్టింది. నేను గతంలో ఓ యువకుడిని ప్రేమించాను. అతడిని కాదని నా తల్లిదండులు దేవేంద్రగౌడకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. దీంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేని కారణంగానే అతడిని హత్య చేయాలనుకున్నానని ఆ యువతి తెలిపింది. నిందితురాలు చెప్పిన విషయాలు విన్న దేవేంద్రగౌడ, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కాబోయే భర్తను కత్తితో పొడిచిన యువతి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.