వీరికి గతేడాది మే 15న ఘనంగా వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ, ఆ ఒక్క కారణంతో భార్య ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. అదే చెట్టు కింద ఆత్మహత్య చేసుకున్నాడు.
వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి ఏడాది కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. వీరి జంటను చూసి ఇరువురి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కట్ చేస్తే.. పెళ్లైన నాలుగు నెలలకే భార్య పుట్టింట్లో ఇంటి ముదున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్పటి నుంచి భార్యను తలుచుకుంటూ భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కట్ చేస్తే.. భార్య ఉరి వేసుకున్న చోటే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామం. ఇక్కడే బొల్లంపల్లి శ్యామ్ సుందర్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు హుస్నాబాద్ లోని గోదాంగడ్డ కాలనీకి చెందిన శారద అనే యువతిని గతేడాది మే 15న వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇక భర్త శ్యామ్ సుందర్ జానపద కళాకారుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. శారద మానసిక స్థితి సరిగ్గా లేక బాధ పడుతూ ఉండేది. తనకున్న అనారోగ్య సమస్యను తట్టుకోలేక ఆ వివాహత పెళ్లైన నాలుగు నెలలకే సెప్టెంబర్ 20న ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీంతో అప్పటి నుంచి ఆమె భర్త శ్యామ్ సుందర్ భార్య లేనిది నేను ఉండలేనంటూ తరుచు కుటుంబ సభ్యులకు చెబుతూ బాధపడేవాడు. పెళ్లైన కొన్ని నెలలకే భార్య చనిపోవడంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మే 14న రాత్రి శ్యామ్ సుందర్ తన అత్తింటికి వెళ్లి.. భార్య ఉరి వేసుకున్న చెట్టు కిందే పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య లేకుండా బతకలేనని ఆత్మహత్య చేసుకున్న శ్యామ్ సుందర్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.