Kadapa: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం బలి తీసుకుంది. డబ్బుల విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా ఆమె ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. సదరు మహిళను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కడప జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా వేంపలి పట్టణానికి చెందిన షేక్ ఫర్హనా (28) 11 ఏళ్ల క్రితం పట్టణ పరిథిలోని రాజీవ్ నగర్‌కాలనీ వాసుడైన ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా లతీఫ్ అనే పిల్లాడు పుట్టాడు. అయితే, మనస్పర్థల కారణంగా కొన్నేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫర్హనా.. జావీద్ అనే వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి జహీన్ షే అనే కుమారుడు పుట్టాడు. జావీద్ మూడేళ్ల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అప్పటినుంచి భార్యను పట్టించుకోవటం మానేశాడు.
దీంతో ఫర్హనా.. షేక్ బాష అలియాస్ ఇడ్లీ బాషతో పరిచయం పెంచుకుంది. వీరిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫర్హనాకు ఓ కానిస్టేబుల్‌తో సంబంధం ఉందని ఇడ్లీ బాష అనుమానించాడు. బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఇదే విషయమై గొడవపడ్డాడు. గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు ఆమెను చంపాలనుకున్నాడు. గురువారం తెల్లవారుజామున ఫర్హనా గొంతు కోసి అతికిరాతకంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇడ్లీ బాషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Lucky Saxena : ప్రముఖ యాంకర్, కవయిత్రి లక్కీ సక్సేనా ఆత్మహత్య!