కల్పనా చావ్లా.. ఎంతోమంది యువ ఆస్ట్రోనాట్లకు ఆమె ఒక ఇన్స్పిరేషన్. భారతదేశం చిరకాలం గుర్తుంచుకునే వ్యోమగామి ఆమె. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రొనాట్. భారత మూలాలు ఉన్న కల్పన 40 ఏళ్ల వయసులో ఆమె ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రమాదం జరగటంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ ప్రమాదంలో కల్పనతో పాటు మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు. అయితే ఆమె గురించి బయటి ప్రపంచానికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కల్పనా చావ్లా హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ అనే గ్రామంలో 1962, మార్చి 17న జన్మించారు. చిన్నతనం నుంచే విమానాలు, ఎగురుతున్న వస్తువులంటే ఎంతో ఆసక్తి కనబర్చేవారు. ఆమె తన స్కూల్ విద్యను కర్నాల్‌లోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్లో పూర్తిచేశారు. ఆ తర్వాత పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు. 1984లో అమెరికాలోని టెక్సాన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆస్ట్రొనాట్ అవ్వాలనేది కల్పనా చావ్లా చిన్ననాటి కల. దానికి తగ్గట్లుగానే ఆమె చదువును కొనసాగించారు. అలా 1988లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన అమెస్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగంలో చేరారు. చావ్లా 1997మొట్టమొదటి STS -87 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లింది.
దీంతో, కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాదు, తొలి ఆసియా మహిళగా కూడా రికార్డు సృష్టించారు. 2003 జనవరిలో STS-107 అంతరిక్ష నౌకలో ఆమె రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లింది. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుండగా ప్రమాదం జరిగి..కల్పనతో పాటు మరో ఆరుగురు సిబ్బంది కూడా మరణించారు. కల్పన గౌరవార్థం దేశంలోని ఎన్నో విద్యాసంస్థలకు, స్కాలర్‌షిప్‌లకు, అవార్డులకు ఆమె పేరు పెట్టారు. యువ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం 2004లో కల్పనా చావ్లా అవార్డును ఏర్పాటు చేసింది. కల్పన చ్లావా గురించి మరిన్ని విషయాల కోసం కింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.