యువకుడితో మాట్లాడినందుకు భార్యను నడి వీధిలో బట్టలు విప్పి కొట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. అలీరాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళ తన సోదరి ఇంటికి వెళ్తూ దారిలో తెలిసిన యువకుడితో మాట్లాడింది. అదే సమయంలో ఆమె భర్త, అత్త వచ్చారు. యువకుడితో తన భార్య మాట్లాడుతుండడంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దుస్తులు చిరిగితున్న కనికరించకుండా బట్టలు విప్పేసి మరీ దారుణంగా కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్టు చేశారు.