కొంతమంది భార్యభర్తలు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య రేగి వివాదాలకు, మనస్పర్దలకు తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన రాహుల్ గౌడ్, మౌనిక ఇద్దరు భార్యాభర్తలు. గతంలో ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఇక కొంత కాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు దూసుకొచ్చాయి. దీంతో భార్య ఏకంగా భర్తను కాదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు సమక్షంలో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక భార్య తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
దీంతో తట్టుకోలేని భర్త అదే స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే గమనించిన పోలీసులు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కోన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి భర్త రాహుల్ గౌడ్ మరణించాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.