అది ఉత్తరప్రదేశ్ లోని ఖైలీలోని ఈపీసీఈ ఆస్పత్రి. ఈ హస్పిటల్ ని 1991 సంవత్సరంలో నిర్మించారు. ఈ భవనానికి మూడు నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. ముసలివాలైన, పేషెంట్స్ అయిన నడవటానికి వీలుగా ఆస్పత్రి నిర్మాణంలో భాగంగా ఓ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. అది కొంత కాలం బాగానే పని చేసింది. ఆ తర్వాత 1997లో ఆ లిఫ్ట్ పాడై పూర్తిగా పనికి రాకుండా పోయింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఆ లిప్ట్ ను అలాగే వదిలేసింది.
తాజాగా ఆ ఆస్పత్రి భవనాన్ని మరమ్మతుల్లో భాగంగా లిఫ్ట్ తలుపులు తెరిచి చూశారు. దీంతో అందులో కనిపించిన భయంకరమైన దృశ్యాలతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ లిప్ట్ లో పూర్తిగా ధ్వంసమైన వ్యక్తి అస్థిపంజరం దర్శనమిచ్చింది. దీంతో వెంటనే యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ మనిషి అస్థిపంజరంపై విచారణ చేపట్టారు.
అసలు ఈ మనిషి ఇందులో ఎందుకున్నాడు? అందులోనే చనిపోయాడా లేక ఎవరైన హత్య చేసి అందులో పడేశారా? వంటి కోణాల్లో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇక డీఎన్ఏ ఆధారంగా మరిన్ని వివరాలను తెలుసుకుంటామంటున్నారు పోలీసులు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.