అది సిద్దిపేట జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామం.. ఇదే గ్రామానికి చెందిన శివకు శీరిష అనే అమ్మాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజల పాటు వారి అన్యోన్య జీవితం సాఫీగానే సాగుతోంది. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్ది భార్య శిరీష వ్యవహారంలో మార్పు కనిపించింది. ఇంటి పక్కనే ఉంటూ వరుసకి అల్లుడి అయ్యే శ్రీకాంత్‌పై శిరీష మనసు పారేసుకుంది. దీంతో అల్లుడు శ్రీకాంత్ కూడా సై అన్నాడు. ఇక వారిద్దరూ ఒకరినొకరు చికటి సంసారానికి కూడా తెర లేపారు.
కొన్నాళ్ల పాటు భర్తకు తెలియకుండా శిరీష శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కుటుంబ బంధాలు, అత్తమామల విలువలు, భర్త నమ్మకాన్ని ఇలా అన్ని వదిలేసిన శిరీష శ్రీకాంత్‌తో మాత్రం గుడి వెనక నా సామి అంటూ శారీరక సుఖాన్ని అనుభవిస్తోంది. ఇలా వీరి వ్యవహారం కొన్నాళ్లకు భర్తకు, అత్తింటివాళ్లకు తెలిసింది. దీంతో అందరు స్పందించి శిరీషను మందలించే ప్రయత్నం చేశారు. మార్పు వస్తుందని అందరూ అనుకున్నారు. ఎంతకైన వారి వ్యవహారంపై అత్త ఓ కన్నేసి ఉంచింది. ఒక రోజు భర్త శివ ఓ పని మీద రాత్రి రానని భార్యకు చెప్పి ఊరెళ్లాడు.
దీంతో శిరీష అలెర్ట్ అయి అల్లుడైన శ్రీకాంత్‌ను ఏకంగా బెడ్ రూంలోకి రప్పించుకుంది. ఇక అర్ధరాత్రి 11 గంటలకు అత్తకు అనుమానం వచ్చి చూసే సరికి ఒకే రూంలో శ్రీకాంత్, శిరీష కనిపించారు. దీంతో వెంటనే అత్త వాళ్లున్న బెడ్ రూంకి తాళం వేసి ఉదయం వరకు అలాగే బంధించాలనుకుంది. దీంతో ఈ విషయాన్ని గ్రహంచి శిరీష, శ్రీకాంత్ భయంతో వణికిపోయారు. తెల్లారేసరికి అందరూ వస్తే మా పరువు ఏమై పోతుందేమోనని భావించి ఊహించుకోలేకపోయారు. ఇక వాళ్లిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. కాగా ఉన్నట్టుండి పరువు కోసం పాకులాడిని వాళ్లిద్దరూ తెల్లారేసరికి అదే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయం అత్త తలుపులు తెరిచి చూస్తే ఫ్యానుకు వేలాడుతూ విగతజీవులుగా దర్శనిమచ్చారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక శిరీష, శ్రీకాంత్ చేసిన పని సమాజంలో ఎంతో మంది చేస్తూ పచ్చటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు చర్యలకు కాలు దువ్వకుండా వాళ్లకు మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారో వాటిని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.