ఓ తండ్రి కనిపెంచిన కూతురిపై కన్నేశాడు. ఎలాగైన తన కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఇక ఇందులో భాగంగానే ఆ దుర్మార్గుడు ఆ బాలికపై బలవంతంగా మూడేళ్ల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణం జరిగింది ఎక్కడో కాదు..!
కన్న పిల్లలకు చిన్న హాని జరిగినా.. కనిపెంచిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. కొడుకు చెడ్డొడైనా సరే కన్నవాళ్లు దగ్గరకు చేర్చుకుని మంచి చెడులు వివరిస్తుంటారు. ఇక ఇంట్లో ఎదిగిన కూతుళ్లు ఉంటే మంచి వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలని చూస్తుంటారు. కానీ, ఇవన్నీ మరిచిన ఓ తల్లిదండ్రులు మాత్రం.. సభ్య సమాజం తలదించుకునే దారుణానికి పాల్పడ్డారు. భార్య అండతో భర్త.. కూతురిపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది హర్యానా రాష్ట్రం రేవారీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఈ బాలిక స్థానిక స్కూల్ లో చదువుకుంటుంది. అయితే కూతురిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన ఈ తల్లిదండ్రులు బరితెగించి దుర్మార్గంగా ప్రవర్తించారు. విషయం ఏంటంటే? ఆ బాలిక తండ్రి తన కూతురిపై కన్నేశాడు. ఎలాగైన కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఇక ఇందులో భాగంగానే తండ్రి ఆ బాలికపై బలవంతంగా అత్యాచారం చేయసాగాడు.
కూతురు నొప్పిగా ఉందని ఎంత మొత్తుకున్నా.. అవేం పట్టించుకోని ఈ దుర్మార్గుడు.. తన శారరీక సుఖాన్ని తీర్చుకున్నాడు. అంతేకాకుండా.. వద్దు అని అరిస్తే నీ కాళ్లు, చేతులు నరికేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు తండ్రి కూతురిపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఇదే విషయాన్ని ఆ బాలిక తన తల్లితో ఏడుస్తూ వివరించగా.. ఈ కసాయి తల్లి భర్తకే మద్దతు పలికిందట. ఇక ఇన్నాళ్లు భరించిన ఆ బాలిక.. తట్టుకోలేకపోయింది. ఈ సోమవారం తల్లిదండ్రులు చేస్తున్న దారుణాన్ని మహిళా పోలీసులకు వివరించింది.
ఆ బాలిక మాటలు విన్న పోలీసులు కోపంతో ఊగిపోయారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దుర్మార్గపు తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. సభ్యసమాజం తలదించుకునేలా ఉన్న ఈ దారుణంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అభం, శుభం తెలియని కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఈ తండ్రికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.