కన్న తండ్రిలా ఉండల్సిన ఓ మారు తండ్రి వేషం మార్చి బలికను వంచించాడు. మాయమాటలు చెప్పి శారీరక సుఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తండ్రి అవతారంలో ఉన్నాడని ఆ బాలిక నమ్మింది. కానీ..చివరికి అతడే కామ పిశాచి అని గ్రహించలేకపోయింది. తాజాగా మారు తండ్రి కూతురులాంటి బాలికపై లైంగిక కోరికలు తీర్చుకున్న ఘటన అన్నవరం పరిధిలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ గిరిజన గ్రామానికి చెందిన కొర్ర ఇజ్రాయెలు ఇంతకు ముందే పెళ్లైన వివాహితను వివాహం చేసుకున్నాడు. ఇక భర్త అనారోగ్య కారణాలతో మరణించటంతో ఇజ్రాయెలును పెళ్లి చేసుకోవటానికి ఆ మహిళ ముందుకు వచ్చింది. దీంతో ఆ మహిళకు పదేళ్ల కూతురు కూడా ఉంది. అలా కొన్ని రోజులు వారి జీవితం గడుస్తూ ఉంది. అంతలోనే ఇజ్రాయెలు వరసకు కూతురు లాంటి ఆ బాలికపై కాస్త కన్నేశాడు.
దీంతో భార్య బయటకు వెళ్లటం చూసిన భర్త కూతురును అడవుల్లోకి తీసుకెళ్లి కర్కశంగా వ్యవహరించాడు. ఇక బాలికను లైంగికంగా చిత్ర హింసలకు గురిచేసి అత్యాచారం చేశాడు. ఇక ఈ విషయం తల్లికి తెలియటంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది. ఈ కీచక తండ్రి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.