ఓ మామ తన కుమారుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చివర్లో ఓ సూపర్ ట్విస్ట్ ఉంది.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఎక్కడెక్కడో జరిగిన విషయాలు వీడియోలు, ఫొటోల రూపంలో వైరల్ అవుతూ ఉన్నాయి. క్షణాల్లో వింత, విచిత్రమైన వీడియోలు ప్రపంచం మొత్తాన్ని చుడుతూ ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని వీడియోలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ 50 ఏళ్లు పైబడిన వ్యక్తి, ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వెళుతూ ఉన్నారు. వయసు తేడాతో పెళ్లిళ్లు జరగటం మామూలే కదా.. అందులో ఆశ్చర్యపోవటానికి ఏముందని అనుకుంటున్నారా?.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వాళ్లిద్దరూ మామ, కోడలు. అంటే.. మేనకోడలు కాదు.. కుమారుడి భార్యను మామ పెళ్లి చేసుకున్నాడు.
అది కూడా ఆమె భర్త చనిపోయిన తర్వాత ఈ పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ వీడియో చూస్తున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. 6 నిమిషాల వీడియో చివర్లో ఓ సూపర్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. వాళ్లిద్దరూ నిజమైన మామ, కోడలు కాదు.. వాళ్లకు నిజంగా పెళ్లి కూడా కాలేదు. ఆ వీడియో కేవలం కల్పితం అని ఉంది. ‘‘ ఈ వీడియోలోని ప్రతీది కేవలం కల్పితం మాత్రమే.. నిజం ఎప్పుడూ చూపించిన దాని కంటే ఎక్కువ చేదుగా ఉంటుంది. ఇందులో చూపించిందంతా నిజం కాదు. మనలాంటి దేశాల్లో జరుగుతున్నదే చూపించాం’’ అని చివర చెప్పుకొచ్చారు ఆ వీడియో చేసిన వారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.