Crime News In Telugu: ఓ కోడలు దారుణానికి పాల్పడింది. మామను ప్రైవేట్ పార్టుపై కొట్టి చంపింది. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆసల్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, భాన్స్‌వారా జిల్లాలోని నాథ్‌పుర గ్రామానికి చెందిన బడియా కటారా అనే వ్యక్తికి అల్లుడు సంతోష్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ విషయమై తరుచూ ఇద్దరూ గొడవపడేవాళ్లు. ఈ నేపథ్యంలో జులై 11న బడియా కటారా, సంతోష్‌లు ఆస్తి విషయమై మరోసారి గొడవపడ్డారు.
ఈ గొడవలో సంతోష్ చెల్లెలు కూడా భాగమైంది. ఇరు వర్గాలు ఘోరంగా తిట్టుకున్నాయి. గొడవ కాస్తా పెద్దదైంది. దీంతో సంతోష్ చెల్లెలు తీవ్ర ఆగ్రహానికి గురైంది. మామపై దాడికి దిగింది. మామ ప్రైవేట్ పార్టుపై పదేపదే కొట్టసాగింది. ఆయన ఎంత తప్పించుకుందాం అని చూసినా వదల్లేదు. ముసలాయన చచ్చిపోతాడని భావించిన ఇతర కుటుంబసభ్యులు కలుగు జేసుకున్నారు. ఎంతో కష్టం మీద గొడవను సద్ధుమణిగించారు.
అయితే, ప్రైవేట్ పార్టు మీద తీవ్ర గాయాలు కావటంతో బడియా కటారా ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స చేసిన వైద్యులు రెండు రోజుల తర్వాత ఇంటికి పంపేశారు. ఇంటి వచ్చిన మరుసటి రోజే బడియా కటారా మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆలయానికి పూజల కోసం వచ్చిన మహిళలను వశీకరణతో లొంగదీసుకుంటున్న పూజారి!