దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రతాచర్యలు ఎంత కఠినతరం చేసినా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన నలుగురిలో ఇద్దరు చిన్నారులు ఉండడం చూపరులను కలచివేసింది. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునే లోపే ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇది చదవండి: కోర్టు సంచలన తీర్పు.. 38 మందికి మరణశిక్ష..!
మృతులంతా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు వెళుతూ వారి కారు ప్రమాదానికి గురైంది. లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. దాంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. గాజువాక చెందిన ప్రేమ్ కుమార్ (23), స్వాతి (25), చాము(2), సునీల్ కుమార్ (25) కారులోనే చనిపోయారు. కారు డ్రైవర్ ఖాదర్ పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.