శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి ఏరో డాన్ అనే సంస్థతో కలిసి అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి చేరుకుని రోజుకు కొన్ని లక్షల మంది శ్రీవారిని దర్శించుకుంటుంటారు. ఇక భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తులకు ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. ఇదిలా ఉంటే, శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులు, తిరుపతి నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది. తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులు, నగర వాసులు తిరుపతి చుట్టు పక్కల అందాలను తిలకించడానికి అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఏరో డాన్ అనే సంస్థతో కలిసి జాయ్ రైడ్ పేరుతో తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి వీలుగా ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఈ జాయ్ రైడ్ ను ఏరో డాన్ సంస్థ ప్రతినిధులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రైడ్ ద్వారా హెలీకాప్టర్ నుంచి తిరుపతి చుట్టు పక్కల అందాలను వీక్షించడానికి వీలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ రైడ్ ను తిరుపతి పోలీస్ గ్రౌండ్ నుంచి ప్రారంభిస్తారు.