‘శారీరక సుఖం – వివాహేతర సంబంధం’ చూశారుగా ఈ రెండింటి బంధం. ఐదు నిమిషాల శారీరక సుఖం కోసం అడ్డదారి తొక్కుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాకుంటే ఇందుకు ‘పెళ్లి’ అనే మూడు ముళ్ల బంధాన్ని పావుగా వాడుకుంటున్నారు. పెళ్ళైతే లైసెన్స్ వచ్చేసినట్లుగా.. ఫీలవుతూ.. కట్టుకున్న వాళ్లను వదిలేసి పరాయి వాళ్లతో కామ వాంక్ష తీర్చుకుంటున్నారు. ఈ వార్త కూడా ఆ కోవకు చెందిందే. తన అందాన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఇల్లాలు.. పరాయి మగాళ్లకు అలవాటు పడింది. దీన్ని భరించలేని ఓ భర్త తన అత్తమామలతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై, కాసిమేడు ఫిషింగ్ పోర్ట్ సమీపంలోని పుదుపున్నార్ పేట్ లో నివాసం ఉంటున్న సెల్వం అనే వ్యక్తికి సుమిత్రా అనే యువతితో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితం కొన్నాళ్ల పాటు సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుమిత్రకు భక్తి కూడా ఎక్కువ. చూడటానికి చామనచాయలో ఉన్నా సన్నగా, చాలా అందంగా ఉంటుంది. ఇదే ఆమె కొంప ముంచింది.భర్త సెల్వం పని మీద ఎక్కువగా బయట ఉండటంతో.. పరాయి మగాళ్లకు ఆకర్షితురాలయ్యింది. ఈ క్రమంలో సుమిత్రా నాగౌరావ్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సెల్వం.. సుమిత్రాను మందలించాడు. ఇద్దరు పిల్లలున్నారని.. పద్దతి మార్చుకోవాలని చెప్పాడు.
కొన్నాళ్ల పాటు పద్ధతిగా మెలిగిన ఆ ఇల్లాలు కొంతకాలం తరువాత మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో విసిగిపోయిన ఆమె భర్త.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలానూ అందరికీ తెలిసిపోయింది అన్నట్లుగా.. రానురాను మరికొంతమందితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వస్తోంది. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు రెజీనా, సెల్వకుమార్ ఆమెను చంపి.. చీరకు ఉరేశారు. అనంతరం ఆమె కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించి అంత్యక్రియల జరిపించారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా చేరి పోలీసుల వంతకు చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమిత్రా అడ్డగోలుగా అక్రమ సంబంధాలు నడుపుతుండంతో భరించలేక హత్య చేసినట్లుగా అంగీకరించారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నాన్న, అమ్మమ్మ, తాత.. ఇలా అయినవారంతా జైలుకెళ్ళడంతో.. ఆ ఇద్దరు అనాథలయ్యారు.